కేవలం రూ.9వేల రూపాయలకోసం బావ బావమరిదిల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ఇరువురి తరపున వర్గీయులు పరస్పర దాడులకు పూనుకున్నారు. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురికాగా, మరో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు.
తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగియడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టారు. ఐఏఎస్ ఆఫీసర్ కాట ఆమ్రపాలి తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ అధికారుల కన్నా పవర్‌ఫుల్‌గా మారారు. తాజాగా చేపట్టిన బదిలీల్లో ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించారు.
ఈ నెల 28న వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరంగల్ నగరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి సారించనున్నారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఈనెల 28న హనుమకొండ కలెక్టరేట్లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
జూడాలతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఈ క్రమంలోనే సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జూడా వెల్లడించారు. ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రాలేదని జూడాలు అంటున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని.. ఇది చారిత్రక నిర్ణయమని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అని.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం కేసీఆర్, కేటీఆర్‌లకు ఇష్టం లేనట్లుందని ఆయన విమర్శించారు.
గోషామహల్ ప్రజలకు ఎమ్మె్ల్యే రాజా సింగ్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డబుల్ బెడ్ రూం దరఖాస్తు దారులకు ఫేక్ కాల్స్ చేస్తూ.. అజ్ఞాత వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. ఫేక్ కాల్స్‌కు ప్రజలు ఎవరు స్పందించవద్దని సూచన చేశారు.