తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ నేటి ఉదయం ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో ఆయన మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఇప్పటికీ పెండింగులోనే ఉన్న కొన్ని విభజన సమస్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎంహెచ్ఓలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు.