Mahabubabad: ఆ కాలనీకి ఒకటే కరెంట్ మీటర్.. బిల్లు ఎంత వచ్చిందంటే..!
- మహబూబాబాద్‌లో ఒక్క కరెంట్ మీటర్‌తో 300 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్
- అధికారులు సౌకర్యాలు కల్పించాలని కాలనీ వాసుల వేడుకోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ఇక పచ్చని పల్లెలు ప్రగతికి మెట్లు అని పెద్దలు అంటుంటారు. అంతేకాదు.. కేంద్రం ప్రభుత్వం వికసిత్ భారత్ కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థికంగాను దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ అభివృద్ధిలో మాత్రం ఇంకా మార్పు కనిపించడం లేదు.
ఇది కూడా చదవండి: Israel-Hezbollah: ఇజ్రాయిల్-హిజ్బొల్లా మధ్య యుద్ధ మేఘాలు.. లెబనాన్‌లోని ఇండియన్స్‌కి కేంద్రం జాగ్రత్తలు..
Also Read
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
అది తెలంగాణలోని జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ ప్రాంతం. 28 వార్డులోని మంద కొమురయ్య కాలనీ. దాదాపు ఇక్కడ 300 ఇళ్లులు ఉన్నాయి. ప్రజలు చాలా కాలంగా నివాసం ఉంటున్నారు. కానీ కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతులు కల్పించాల్సిన అధికారులు మాత్రం ముఖం చాటేశారు. దీంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. దీంతో చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నారు. పురపాలక సంఘం నెంబర్లు కూడా కేటాయించింది. కానీ విద్యుత్ సౌకర్యాన్ని మరిచింది. కనీసం ఒక్క వీధి దీపాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. చీకట్లోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు.
ఇది కూడా చదవండి: Snakebite: ఏడాదిలో పాముకాటులో 50,000 మంది మృతి, ప్రపంచంలోనే అత్యధికం
అయితే పరిశ్రమ కోసం ఒకరు విద్యుత్ మీటర్ తెప్పించుకున్నారు. అంతే ఆ ఒక్క మీటర్‌పైనే అందరూ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ దీపాలు వెలిగించుకుంటున్నారు. కర్రలు, చెట్లే ఊతంగా సర్వీసులు లాక్కున్నారు. తాటిచెట్టుకు ఒక స్ట్రీట్ లైటు ఏర్పాటు చేసుకున్నారు. కొమ్మల సాయంతో విద్యుత్ కనెక్షన్లు లాక్కున్నారు. అయితే ఈ ఒక్క మీటరకే ప్రతీ నెల రూ.65 వేలు కరెంట్ బిల్లు వస్తుంది. ఇప్పటి దాకా అందరూ తలా కొంత వేసుకుని చెల్లిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. పేదలకు విద్యుత్ రాయితీ ఇస్తుంటే తామెందుకు కట్టాలంటూ కొన్ని నెలలుగా కరెంట్ బిల్లు కట్టడం మానేశారు. దీంతో ఈ బిల్లు రూ.2.65 లక్షలకు చేరింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని కాలనీ వాసులు వాపోతున్నారు. తక్షణమే విద్యుత్ శాఖ అధికారులు తమకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయితే పురపాలక సంఘం ఖర్చులు భర్తిస్తే.. వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన అక్రమ సంబంధం.. ఏం జరిగిందంటే..!
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?