Hayathnagar Bike Accident Update: సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడానికి, లైక్స్ రావడం రీల్స్ చేస్తున్న యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీల్స్ చేస్తూ ఇప్పటికే ఎందరో చనిపోగా.. తాజాగా అలంటి ఘటనే మరొకటి జరిగింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. శనివారం బైక్‌పై స్టంట్లు చేస్తూ తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు ఈరోజు మృతి చెందాడు. బైక్ అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న యువకుడు ప్రాణాలు విడిచాడు. హయత్ నగర్ పోలీస్…
Man Kills Wife and Daughter in Bowenpally: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్య, 10 నెలల కన్న బిడ్డను ఓ వ్యక్తి చంపాడు. ఆపై అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు భావిస్తున్నారు. మహారాష్ట్ర నాంథేడ్‌కు చెందిన గణేశ్,…
Flood Effect: గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద ప్రవాహాం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కుంట దగ్గర జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తింది. ఈ వరద దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా, హౌసింగ్ శాఖ స్పెషల్ సీఎస్ గా వికాస్‌రాజ్‌ను నియమించారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్.. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ కొర్రా లక్ష్మి.. రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా హరీష్.. మేడ్చల్ మల్కాజ్గిరి అదనపు కలెక్టర్‌గా రాధికాగుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు.