Projects Gates Closed: శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల గేట్లు మూసివేత
- కృష్ణా బేసిన్‌లో తగ్గిపోయిన వరద ప్రవాహం
- శ్రీశైలం..నాగార్జున సాగర్ జలాశయాల గేట్లు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Projects Gates Closed: కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం తగ్గిపోయింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. ఈ క్రమంలో అధికారులు ఆ ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి సుంకేసుల నుంచి మాత్రమే నీరు వస్తుంది. దీంతో గత వారం రోజుల తో పోలిస్తే.. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా తగ్గింది. వరద తగ్గిపోవడంతో రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ఇన్ ఫ్లో 77,598 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 68,211 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.20 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 194.3096 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Read Also: CM Chandrababu: వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష.. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై సీరియస్
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
శ్రీశైలం జలాశయం నుంచి ఇన్‌ఫ్లో భారీగా తగ్గిపోవడంతో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ప్రాజెక్టు అధికారులు మూసివేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయగా.. అనంతరం అన్ని గేట్లను మూసివేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు క్రస్ట్ గేట్ల ద్వారా 1.43 లక్షల క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,541 క్యూసెక్కులు, కుడికాలువకు 3937 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 29,273 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇన్ ఫ్లో 40,863 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 40,863 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 588.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 307.8746 టీఎంసీలుగా ఉంది.
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?