హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీల్లో ఈ ముఠా పట్టుబడింది. ఐదుగురు సభ్యుల ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధుల తీరు మారడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా మారింది. కన్న బిడ్డలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు కత్తిమీద సాములాగా మారింది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెత్తుల్లా గ్రామంలో జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ యువకుడు సెల్ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మేస్త్రం కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాను మంత్రి పదవి ఆశిస్తున్నానని.. తన అభిప్రాయాన్ని సీఎంకు చెప్పినట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెల్లడించారు. సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. మీడియాతో చిట్చాట్లో పలు విషయాలను ఆయన పంచుకున్నారు.
సోషల్ మీడియాలో ఓ చిన్నారి పై కొందరు యవకులు జుగుప్సాకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఘటనపై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేసారు.
మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై అధికారుల నుంచి నివేదిక కోరారు. అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
CM Revanth Reddy: వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.