Fire Accident: షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం.. నిద్రలోనే తల్లీకూతుళ్లు మృతి
- పెద్దపల్లి జిల్లా రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రాంనగర్‌లో ప్రమాదం
- షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో చెలరేగిన మంటలు
- నిద్రలోనే తల్లీకూతుళ్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: నిద్రలోనే తల్లి కూతుళ్లు మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రాంనగర్‌లోని గడ్డం కనకయ్య ఇంట్లో రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించి ఇద్దరు మహిళలు గుర్తుపట్టనంతగా కాలిపోయి మృతి చెందారు. కనకయ్య తన భార్య, అత్తతో కలిసి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరితోపాటు ఇంట్లో మూగజీవాలైన పెంపుడు కుక్క, ఒక కోడి కూడా చనిపోయాయి. గ్రామానికి చెందిన గడ్డం కొమురమ్మ (45), కల్వల పోచమ్మ (65) అనే ఇద్దరు తల్లి కూతుళ్ళు అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇళ్ళంతా మంటలు వ్యాపించి మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఇంట్లోని గృహపకరణాలు కూలరు, విద్యుత్ వైర్లు, కాలిపోయాయని ఏసీపీ రమేష్ తెలిపారు. గోదావరిఖని ఏసీపీ రమేష్, మంథని సీఐలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి పరిసరాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కనకయ్య పని నుండి రాత్రి తిరిగివచ్చి ప్రమాదం జరిగిన సమయంలో కొమరమ్మ భర్త ప్రమాదాన్ని చూసి భయపడి తన బావమరిదిని తీసుకొని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో రెండు మూగజీవాలు బలి కావడంతో పశువైద్యాధికారులను కూడా సంప్రదిస్తామని ఏసీపీ తెలిపారు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
తాజావార్తలు
-
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!