Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానమిచ్చారు. కేటీఆర్ తనకు ఇచ్చిన లీగల్ నోటీసులను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. లేకుంటే వారం రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Read Also: Babu Mohan: టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్
కేటీఆర్ పేరును మీడియా సమావేశంలో బండి సంజయ్ ఎక్కడ ప్రస్తావించలేదని ఆయన తరఫు న్యాయవాది లీగల్ నోటీసుకు సమాధానమిచ్చారు. మీడియాలో, సోషల్ మీడియాలో ఏమీ ప్రసారం జరిగిందో బండి సంజయ్‌కి తెలియదన్నారు. పోన్ ట్యాపింగ్ జరిగినట్టు కేటీఆర్ గతంలో అంగీకరించారని వెల్లడించారు. కేటీఆర్ తనపై చేసిన అన్ని ఆరోపణలను బండి సంజయ్ ఖండించారని న్యాయవాది తెలిపారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవి కావు, నిరాధారమైనవి కావు, ఎవరి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశం లేదన్నారు. కేటీఆర్‌ను గానీ, ఆయనకు సంబంధించిన ఏ వ్యక్తిని గానీ లక్ష్యంగా చేసుకోవడానికి, హోం వ్యవహారాల సహాయ మంత్రిగా, లోక్‌సభ సభ్యునిగా తన పదవిని ఏ సమయంలోనూ దుర్వినియోగం చేయలేదన్నారు.