CM Revanth Reddy: నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం.2 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేస్తారు.
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు వైభంగా జరుగుతున్నాయి. పూల వేడుకలో ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతులు, చిన్నారుల ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ప్రపంచమంతా పూలతో దేవుడిని పూజిస్తే.. ఆ పూలనే దేవుడిగా పూజించే బతుకమ్మ పండగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. ఈనెల 2న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు.. చివరి రోజు (నేడు)సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
IAS Officers: ఏపీ, తెలంగాణ కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమను ఏపీలోనే కొనసాగించాలన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలను మోడీ సర్కార్ తోసిపుచ్చింది.
Pawan Kalyan: ప్రకృతిని పరమేశ్వరి ప్రతిరూపంగా ఆరాధించడం భారతీయ సనాతన ధర్మంలో ఒక గొప్ప ఆచారం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి ప్రకృతిలో ఆకృతి తొడిగే పుష్పాలను బతుకమ్మలుగా పూజించడం తెలంగాణ ఆడపడుచుల సంప్రదాయం.. దేవి నవరాత్రులతో ఆరంభమయ్యే బతుకమ్మల పూజలు, ఆటలు నేటి సద్దుల బతుకమ్మతో ముగియనున్న తరుణంలో నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన భక్తిపూర్వక శుభాకాంక్షలు అని జనసేన అధినేత పేర్కొన్నారు.
CMR Trolls: సిఎంఆర్ షాపింగ్ మాల్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న నకిలీ, మార్ఫింగ్ చేసిన పోస్టు దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నామని.. సిఎంఆర్ షాపింగ్ మాల్ గత 4 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమైన బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుని వేడుక ఏదైనా సిఎంఆర్ తోనే శుభారంభం అనే నానుడితో ప్రతి ఇంటా చెరగని ముద్రవేసిన సంస్థగా గుర్తింపు తెచ్చుకుందని, ఇటీవలి కాలంలో కొంతమంది పోటీదారులు సిఎంఆర్ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో కావాలనే బ్రాండ్ లోగోను ఒక…
రతన్ టాటా కన్నుమూత: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. సోమవారం టాటా ఆస్పత్రికి వెళ్లడంతో.. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఐసీయూలో చేరారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన రతన్ టాటా.. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన…
ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కీలక ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించనుంది. నేడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడోవరోజు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. నేడు శ్రీశైలంలో 8వ రోజు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం మహాగౌరి…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 అభ్యర్థులకు కీలకమైన సమాచారాన్ని అందించింది. 2024, అక్టోబర్ 21 నుండి 27 వరకు జరుగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు 2024, అక్టోబర్ 14 నుండి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, అభ్యర్థులు హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్లోడ్ సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే, టోల్…