రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసి సంఘాలు భేటీ అయ్యాయి. జూబ్లీహిల్స్ లోని సీఎం అధికారిక నివాసంలో బుధవారం భేటీ అయిన పలు సంఘాల ప్రతినిధులు..తమ ప్రాంత సమస్యలను సీఎం కి వివరించారు
అక్కినేని నాగార్జున న్యాయస్థానానికి వెళ్తే మేమెందుకు స్పందించాలి.. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.
రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. వారంలోపు మిగిలిన వారందరికీ రైతు రుణమాఫీ పూర్తి అవుతుందని వెల్లడించారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం అర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.
మైక్రో ఫైనాన్స్ అధికారులు మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఫైనాన్స్ చెల్లించాలని 8 గంటలుగా ఫైనాన్స్ సిబ్బంది మహిళ ఇంట్లో కూర్చున్నారు. మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి.
కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు శాపనార్థాలు తప్పితే సూచనలు లేవని.. దసరా సందర్భంగా ప్రతిపక్షాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నామన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. బాసర సరస్వతి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.