* ఇవాళ, రేపు హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. నేడు సాయంత్రం 6 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రపతి.. 6.20 నుంచి 7.10 వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి.. రాత్రి 7.20కి ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… ఇవాళ రాత్రికి రాజ్‌భవన్‌లో బస.. రేపు ఉదయం 10.20కి శిల్పకళా వేదికలో లోక్‌మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముర్ము.. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగుపయనం
* ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్.. లిక్కర్ కేసులో ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదులకు అనుమతి లేదని పేర్కొంటూ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్.. నేడు విచారణ
* నేడు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. సాయంత్రం 4.30 నుంచి కౌంటింగ్.. 5 గంటల తర్వాత ఫలితాలు
* హైదరాబాద్: నేడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం
* హైదరాబాద్: నేడు 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో లగచర్ల పర్యటన.. ఉదయం 8 గంటలకు సీపీఎం స్టేట్ ఆఫీస్ నుంచి పర్యటన ప్రారంభం
* హైదరాబాద్: శిల్పారామం వేదికగా నేటి నుంచి ఈ నెల 24 వరకు లోక్‌మంథన్-2024.. పలు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు.. నేడు ఎగ్జిబిషన్, స్టాల్స్‌ను ప్రారంభించనున్న వెంకయ్యనాయుడు, జూపల్లి.. రేపు శిల్పారామంలో లోక్‌మంథన్‌ను ప్రారంభించనున్న రాష్ట్రపతి
* హైదరాబావద్: నేడు గాంధీ భవన్ కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ప్రజావాణికి హాజరుకానున్న భట్టి.. ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకు గాంధీ భవన్ లో డిప్యూటీ సీఎం
* మహబూబాబాద్: ఇవాళ బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు అనుమతి ఇవ్వని పోలీసులు.. పర్మిషన్ రిజెక్ట్ కాపీ బీఆర్ఎస్ నేతలకు అందజేత.. జిల్లా వ్యాప్తంగా ఇవాళ 144 సెక్షన్ అమలు.. హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుని మహాధర్నా నిర్వహిస్తామన్న సత్యవతి రాథోడ్
* హైదరాబాద్: నేడు 13వ రోజు భక్తి టీవీ ‘కోటి దీపోత్సవం’.. సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న కార్తిక దీపారాధన
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి..
* ఒంగోలులో పీడీసీసీ బ్యాంక్ లో జరిగిన అవకతవకలపై గత పది రోజులుగా విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ సభ్యులు, ఇవాళ కలెక్టర్ కు విచారణ నివేదిక సమర్పించనున్న బృందం..
* బాపట్ల : చీరాలలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య..
* అమరావతి: ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ఏపీ కౌన్సిల్ ప్రారంభం.. నేడు 1. ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు 2024, మంత్రి కొల్లు రవీంద్ర.. 2. భారత దేశంలో తయారైన విదేశీ మద్యం నియంత్రణ సవరణ బిల్లు 2024, మంత్రి కొల్లు రవీంద్ర.. 3. ఏపీ ప్రొహిబిషన్ సవరణ బిల్లు 2024, మంత్రి కొల్లు రవీంద్ర.. 4. ఏపీ అప్రాప్రియేషన్ సవరణ బిల్లు 2024, మంత్రి పయ్యావుల కేశవ్.. ఏపీ లా అండ్ జస్టిస్ మంత్రి ఎన్.ఎండి.ఫరూక్.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అవసరమైన ఏర్పాట్లు అంశంపై తుది నిర్ణయంపై చర్చ
* అమరావతి: ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ.. ఏపీ లా అండ్ జస్టిస్ మంత్రి ఎన్.ఎంఎడి.ఫరూక్.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అవసరమైన ఏర్పాట్లు అంశంపై తుది నిర్ణయం.. ప్రభుత్వ బిల్లులు: 1. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ చట్టం 2024, మంత్రి అనగాని సత్యప్రసాద్.. 2. ఏపీ మునిసిపల్ చట్టాల రెండవ సవరణ బిల్లు 2024, మంత్రి నారాయణ.. 3. AP GST సవరణ బిల్లు 2024, మంత్రి పయ్యావుల కేశవ్.. 4. AP VAT సవరణ బిల్లు 2024, మంత్రి పయ్యావుల కేశవ్.. 5. ఏపీ ధర్మ, హిందూమత సంస్ధలు, దేవాలయాల చట్ట సవరణ బిల్లు 2024, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. 6. ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ రిపీల్ బిల్లు 2024, బి.సి.జనార్ధనరెడ్డి
* కాకినాడ: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ ఉప సంహరణ కి నేటి తో ముగియనున్న గడువు.. ఒక నామినేషన్ ఉప సంహరణ తో బరిలో మిగిలి ఉన్న ఐదుగురు అభ్యర్థులు.. వచ్చే నెల 5న ఎన్నికలు, తొమ్మిదిన ఫలితాలు
* అల్లూరి ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత… పర్యటక ప్రాంతం వంజంగి మేఘాల కొండ పై తగ్గని పర్యాటకుల రద్దీ… పాడేరు 11, మినుములూరు 09 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు…
* కృష్ణా: మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులను నెల్లూరు సబ్ జైలుకి తరలింపు.. టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. విచారణ కోసం కస్టడీ కి ఇవ్వాలని పోలీసుల పిటిషన్.. నేడు విచారణ చేయనున్న న్యాయస్థానం
* అమరావతి: ఏపీ హైకోర్టులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్. నటి జిత్వానీ కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న కుక్కల విద్యాసాగర్.. సీఐడీ కోర్టులో బెయిల్ డిస్మిస్ చేయటంతో హైకోర్టులో పిటిషన్ వేసిన కుక్కల విద్యాసాగర్.. నేడు విచారణ చేయనున్న హైకోర్టు
* అమరావతి: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ..
* ఖమ్మం: నేడు జిల్లాలకు బీఆర్ఎస్ నేత హరీష్ రావు.. లగచర్ల ఘటనపై కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొననున్న హరీష్ రావు
* మంచిర్యాల: నేడు జిల్లాలో మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు పర్యటన.. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో సూపర్ స్పెషాలిటీ, మాతా శిశు ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేయనున్న మంత్రులు.
* ఆదిలాబాద్: నేడు డీటీసీలో పాసింగ్ అవుట్ పరేడ్. శిక్షణ పూర్తి చేసుకున్న 255 మంది పోలీస్ కానిస్టేబుళ్లు. దీక్షాంత్ పరేడ్ కు హజరు కానున్న ఐజి రమేష్.
* నేడు సంగారెడ్డి జిల్లాలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. ఆందోల్ నియోజకవర్గం మాసాన్ పల్లిలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొననున్న హరీష్ రావు
* తిరుపతి: నేడు నగరంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటన
* తిరుమల: 9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 59,231 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,029 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.08 కోట్లు