అమరావతి నిర్మాణ పనుల ప్రక్రియ ప్రారంభం..
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రక్రియ ప్రారంభమైంది.. కొత్త ఏడాది లో పనులు ప్రారంభం చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.. అనుకున్నట్టుగానే 1200 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచింది సీఆర్డీఏ. ప్రపంచ బాంక్.. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో చేబడుతున్న పనులకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లోని భూముల్లో మౌలికవసతుల కల్పనకు వేర్వేరుగా టెండర్లు పిలిచింది సీఆర్డీఏ.. జోన్ 5 b 5 dలో రోడ్లు డ్రైన్లు.. ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం 1206 కోట్ల రూపాయల విలువైన పనులు జరగబోతున్నాయి. ఇక, వచ్చే నెల 21వ తేదీ వరకు టెండర్ దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. జనవరి నెలాఖరులోగా పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది… రెండు మూడు రోజుల్లో మిగతా పనులకు టెండర్లు పిలవనున్నారు అధికారులు..
న్యూఇయర్ వేడుకలు.. టెంపుల్ సిటీలో హాట్ టాపిక్‌గా పొలిటికల్ బొకేలు
ప్రపంచం మొత్తం 2024 ఏడాదికి బైబై చెప్పి.. 2025కి వెల్‌కం చెప్పేందుకు రెడీ అవుతుంది.. ఈ సమయంలో టెంపుల్ సిటీలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి పొలిటికల్ బొకేలు.. నూతన సంవత్సరం సందర్భంగా ఆయా నేతలకు ఇవ్వడానికి తిరుపతిలోని బొకేల షాపులు ఏర్పాటు చేసిన బొకేలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. ఆయా పార్టీలకు సంబంధించిన రంగులన్న పూలతో తయారు చేసినా బొకేల్లో.. ఆ పార్టీలకు చెందిన నేతల ఫొటోలను కూడా పొందుపరిచారు.. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి బీజేపీ, జనసేన, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ బొకేలు.. అందులోనూ ఎక్కువగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు ఉన్న బొకేలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నట్టుగా చెబుతున్నారు నిర్వాహకులు.. అయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల బొకేలను కూడా పెద్ద ఎత్తున కోనుగోలు చేస్తున్నారట కార్యకర్తలు.. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో నూతన సంవత్సరానికి ముందు పువ్వులు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి.. రాజకీయ నాయకుల చిత్రాలు మరియు పార్టీ చిహ్నాలతో రూపొందించిన పుష్పగుచ్ఛాలు నూతన సంవత్సర వేడుకలకు ముందు టెంపుల్ సిటీలోని ఫ్లోరిస్ట్ బోటిక్‌లలోకి ప్రవేశించాయి.. పూల బుట్టలు మరియు బొకేలు వాటిలో రాజకీయ చిహ్నాలు.. వారి అభిమాన నాయకుల చిత్రాలను చేర్చడం ఆకర్షణగా మారిపోయింది.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న తొలి కొత్త సంవత్సరం కావడంతో.. ఓ పూల వ్యాపారి ఒక ప్రత్యేకమైన ఆలోచనతో వీటిని ముందుకు తీసుకొచ్చారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఫొటోలతో పాటు వారి పార్టీ చిహ్నాలు కమలం, సైకిల్, టీ గాజు, హస్తం గుర్తులు ఉన్నాయి.
పూల మార్కెట్‌లో న్యూ ఇయర్ సందడి.. బొకేలకు ఫుల్ డిమాండ్
నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలపడంలో పూల బొకేలు కీలకపాత్ర పోషిస్తాయి. పలు రకాల పువ్వులతో ఈ బొకేలు తయారు చేస్తుంటారు. అయితే, పువ్వులకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం. కడియపులంక అంతర్ రాష్ట్ర పూల మార్కెట్లో తయారయ్యే ఈ బొకేలు దేశం నలుమూలకు సరఫరా అవుతున్నాయి. నూతన సంవత్సర పూల బొకేలు సిద్ధం అవుతున్నాయి.. కడియం నుంచి దేశం నలుమూలలకు సరఫరా అవుతున్నాయి. ఈ నూతన సంవత్సర వేడుకలకు అవసరమైన బొకేలను రెండు రోజులు ముందు నుండే పెద్ద ఎత్తున తయారీ మొదలుపెట్టారు. కడియపులంక కేంద్రంగా తయారయ్యే ఈ బొకేలకు ఎక్కడలేని డిమాండ్ ఉంది. కడియపులంకతో పాటు బుర్రిలంక, కడియం, కడియపుసావరం తదితర గ్రామాల్లో ఈ బొకేల తయారీ చేపడుతున్నారు. కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్లో పువ్వులు కొనుగోలు చేసి రాష్ట్ర నలుమూలకు బస్సులు, రైళ్లు ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇదే మాదిరిగా ఈ బొకేలను ఆర్డర్లపై తయారు చేస్తున్నారు. వందలాది మంది ఇప్పుడు ఈ బొకేల తయారీలో నిమగ్నమై ఉన్నారు. వంద రూపాయలు బొకే నుంచి ఆర్డర్ పై పదివేల రూపాయల విలువైన బొకేలను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. బెంగుళూరు, ఊటీ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పూలను దిగుమతి చేసుకొని బొకేలు తయారు చేస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు ఉభయగోదావరి జిల్లాలకు ఇక్కడ బొకేలు పెద్ద మొత్తంలో తీసుకెళ్లి రిటైల్ గా అమ్మకాలు సాగిస్తుంటారు. ఈ బొకేల తయారీలో ఇతర రాష్ట్రాలనుండి దిగుమతి చేసుకున్న జర్బరా, ఆర్కెడ్, స్నోన్ బాల్, గ్లాడ్, తార్నుషన్, రిషాంత్, డచ్చీ రోజెస్ వంటి ఖరీదైన పూలను వినియోగిస్తారు. మార్కెట్‌లో రంగురంగుల పూలా బొకేలు కలకల్లాడుతున్నాయి.. బొకేలు కొనుగోలు దారులతో కడియపులంక అంతర్ రాష్ట్ర పూల మార్కెట్లో సందడి నెలకొంది.
మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్నినాని కుటుంబాన్ని వీడడంలో లేదు.. ఇప్పుడు రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో ఏ6గా పేర్ని నాని పేరును చేర్చారు.. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత పేర్ని నాని పై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు.. ఇక, ఈ కేసులో ఏ5గా ఉన్న రైస్ మిల్లర్ బాలాంజనేయులును పేర్ని నానిని కూడా ఇవాళ అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని… రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో పోలీసులు పెట్టిన కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ వేశారు పేర్ని నాని. ఇక, రేషన్ బియ్యం మాయం కేసులో రిమాండ్ రిపోర్ట్ ఎన్టీవీ చేతికి చిక్కింది.. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధ ఉండగా.. ఏ2గా గోడౌన్ మేనేజర్ మానస తేజను చేర్చారు పోలీసులు.. 2016 నుంచి మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర పనిచేస్తున్నారు మానస తేజ.. ఇక, పెడనకి చెందిన లారీ డ్రైవర్ మంగా రావు ఉషోదయ ట్రాన్స్ పోర్ట్ లో లారీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.. గోడౌన్ నుంచి MLS పాయింట్స్ కి మంగారావు పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నట్టు గుర్తించారు.. ఇక, ఏ6 గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు.. ఇదే కేసులో పేర్ని నాని భార్యకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. ఇదే సమయంలో విచారణకు సహకరించాలనే ఆదేశాలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే..
పెండింగ్ వేతనాలు చెల్లించి.. ఆర్పీల జీవితాల్లో వెలుగులు నింపండి!
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పని చేస్తున్న 6,000 మంది ఆర్పీలకు వెంటనే వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అయినా ఆర్పీలకు పెండింగ్ జీతాలను చెల్లించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా.. వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి.. కొన్ని ఫొటోస్ జత చేశారు. ‘ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తాం అంటూ డబ్బా కొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులకు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం శోచనీయం. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 6,000 మంది ఆర్పీలకు ఆరు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం సిగ్గుచేటు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అయినా ఆర్పీల పెండింగ్ జీతాలను చెల్లించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.
ఆ రోజు రాహుల్ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారు..
డిసెంబర్ 19న పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య తోపులాట జరిగిన ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర షడంగీ, ముకేశ్ రాజ్‌పూత్ గాయపడ్డారు. ఈ ఘటనపై తాజాగా గాయపడిన వారిలో ఒక ఎంపీ షడంగీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఆవరణలో తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే.. రాహుల్ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారని మండిపడ్డారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ లాంటి గొప్ప వ్యక్తులు లోక్‌సభలో విపక్ష నేతలుగా వ్యవహరించారు.. అలాంటి పదవిలో ఉన్న ఆయన ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదన్నారు. ఇక, తోపులాటలో గాయపడిన తాను డిసెంబరు 28వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉంది.. తలపై పడిన కుట్లు ఇంకా మానకపోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని బీజేపీ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగీ చెప్పారు.
యెమెన్‌లో నిమిష ప్రియకు మరణశిక్ష.. అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు
యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం కలకలం రేపుతోంది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియ దోషిగా తేల్చబడగా, ఇటీవలే యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమె మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజుల లోపు అమలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నిమిష ప్రియ కేసు తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం యత్నిస్తోందని పేర్కొన్నారు. 2017లో జరిగిన యెమెన్ జాతీయుడు అబ్దో మెహదీ హత్య కేసులో నిమిష ప్రియను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం ఆమెను దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నిర్ణయంపై నిమిష ప్రియ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినా, దాన్ని తిరస్కరించారు. చివరగా, యెమెన్ అధ్యక్షుడు మరణశిక్షను ధృవీకరించడంతో నిమిష ప్రియ పరిస్థితి దారుణంగా తయారైంది. నిమిష ప్రియను శిక్ష నుంచి కాపాడే శక్తి ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యుల చేతిలోనే ఉంది. వారు క్షమాభిక్ష పెడితేనే ఈ శిక్ష నుంచి ఆమె బయటపడగలదు. ఈ విషయాన్ని గ్రహించిన నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్‌కు వెళ్లి, అక్కడి గిరిజన నేతలను సంప్రదించి క్షమాభిక్ష కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అధ్యక్షుడి నిర్ణయం ఆమె కృషిని వృథా చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది.
ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించొద్దు..
ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించకుండా చూసుకోవాలని జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ కామెంట్స్ చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పూర్తిగా జర్మన్ ప్రజల ప్రమేయం మాత్రమే ఉండాలని ఆయన కోరారు. అతివాద పార్టీ ఆల్టర్‌నేటివ్ ఫర్ డౌచ్‌లాండ్‌కు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సపోర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. న్యూ ఇయర్ ను పురస్కరించుకొని షోల్జ్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఒలాఫ్ షోల్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, పార్లమెంటులో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ విశ్వాసం కోల్పోయారు. ఇందులో 733 మంది సభ్యులు ఉన్న సభలో ఇటీవల ఓటింగ్ జరిగింది.. ఆయనకు అనుకూలంగా కేవలం 207 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 394 మంది ఓట్లు పడ్డాయి. మెజారిటీకి 367 ఓట్లు కావాలి.. దీంతో అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 23వ తేదీన ఈ పోలింగ్ జరగబోతుంది. జర్మనీ ఛాన్స్‌లర్‌గా ఒలాఫ్ షోల్జ్ తాత్కాలికంగా పదవీ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
న్యూ ఇయర్ ధమాకా.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
న్యూ ఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. నిన్న పెరిగిన బంగారం ధర.. నేడు భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (డిసెంబర్ 31) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,100గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.77,560గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వరుసగా పెరిగిన వెండి రేట్స్.. గత రెండు రోజులుగా తగ్గుతున్నాయి. నిన్న కిలో వెండిపై రూ.100 తగ్గగా.. నేడు ఏకంగా రూ.2000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.90,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 98 వేలుగా ఉంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.90,500గా నమోదైంది.
రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ టెస్టు తర్వాతే రిటైర్మెంట్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వదేశంలో కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో నిరాశపర్చిన రోహిత్.. ప్రస్తుతం ఆసీస్ తో జరుగుతున్న బోర్డర్ – గావస్కర్ టోర్నీలోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్లు చేస్తున్నారు. దీంతో అతను కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్టు మ్యాచ్ తర్వాత టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పాలని టీమిండియా సారథి రోహిత్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.. అయితే, ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు రోహిత్ శర్మతో మాట్లాడినట్లు తెలుస్తుంది. కానీ, రోహిత్ తన మనసు మార్చుకునే ఛాన్స్ లేదని సమాచారం. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరితే ఆ మ్యాచ్ వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సెలక్టర్లు రోహిత్‌ను ఒప్పించే అవకాశం ఉంది. దీన్ని బట్టి టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించకపోతే.. సిడ్నీలో కంగారులతో జరిగే ఐదో టెస్టు రోహిత్ శర్మకు కెరీర్‌లో చివరి టెస్టు కానుంది.
న్యూ ఇయర్ స్పెషల్.. రామ్ సినిమా నుండి పోస్టర్
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా మిస్టర్ బచ్చన్ భామ, యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో ఆకట్టుకున్న దర్శకుడు మహేష్ బాబు. రామ్ తో చేసే సినిమానూ యూత్, ఫ్యామిలీ కథతో తెరకెక్కించనున్నారు. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూట్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుగుతోంది. కాగా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న ఉదయం 10: 35 గంటలకు ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ రామ్, భాగ్యశ్రీల స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారట. వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రామ్ పోతినేని ఈ సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడని ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం తొలిసారిగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ శివ, మెర్విన్ టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
రూ. 800 కోట్లతో పుష్పరాజ్ ప్రభంజనం
డిసెంబర్ 5న రిలీజ్ అయిన మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప 2. మూడు వారాల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 1700 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా రూ. 1000, 1500, 1700 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా పుష్ప2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఖచ్చితంగా లాంగ్ రన్‌లో రూ. 1800 కోట్ల మార్క్ టచ్ చేసి బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసేలా ఉంది పుష్ప2. అయితే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్‌లో ఒక్క బాలీవుడ్ నుంచే దాదాపుగా సగం వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు బాలీవుడ్ బడా స్టార్స్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌కు సైతం ఈ రేంజ్ వసూళ్లు సాధ్యం కాలేదు. కానీ పుష్పరాజ్ మాత్రం 25 రోజుల్లోనే రూ. 770 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. ఇప్పటికీ నార్త్ బెల్ట్‌లో సాలిడ్ ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోంది పుష్ప 2. అసలు పుష్పరాజ్ క్రేజ్ ఎలా ఉందంటే సినిమా తీసేస్తామంటే ఏకంగా థియేటర్ యాజమాన్యంతో గొడవ దిగుతున్నారు అక్కడి ప్రేక్షకులు. ఈ నెల 25న ఓ థియేటర్లో ఆన్‌లైన్‌లో ‘పుష్ప 2’కి టికెట్లు బుక్ చేసుకున్నారు ప్రేక్షకులు. కానీ తీరా థియేటర్‌కి వెళ్లాక స్క్రీన్ పై ‘బేబీ జాన్’ సినిమా వేయడంతో బేబీ జాన్ మూవీ తమకు వద్దంటే వద్దని నానా రచ్చ చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా సినిమా మార్చేయడం పట్ల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారంటే అర్ధం చేసుకోవచ్చు నార్త్ లో పుష్ప -2 క్రేజ్. ఈ వీకెండ్ నాటికి పుష్ప -2 రూ. 800 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
రామ్ చరణ్ తో కలిసి పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన బాలయ్య
అన్‌స్టాపబుల్ సీజన్ 4 మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది. హోస్ట్ గా బాలయ్య ఎప్పటిలాగే సూపర్ సక్సెస్ ఫుల్ షోను నడిపిస్తున్నారు. ఇప్పటికి ఈ స్టేజ్ పై తెలుగు, తమిళ్, మలయాళం తో పాటు బాలీవుడ్ తారలు కూడా సందరడి చేసారు. ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో ఆయన అన్నసురేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. తాజగా విడుదలైన ఈ ఎపిసోడ్ సూపర్ రికార్డు వ్యూస్ తో దూసుకెళుతోంది. ఇక రాబోయే ఎపిసోడ్ షూట్ ను ఈ రోజు మొదలెట్టారు ఆహా యూనిట్. ఈ ఎపిసోడ్ కు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రానున్నాడు. ఈ ఉదయం రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షూట్ లో పాల్గొన్నారు. అందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ టాక్ షో కు హాజరయ్యాడు రామ్ చరణ్. చరణ్ కు వెల్కమ్ చెబుతూ సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ అలాగే గేమ్ ఛేంజర్ మూడూ సినిమాలు సూపర్ హిట్ కావాలి. ఇండస్ట్రీ మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లాలి. అదే మా ఆశయం ని తెలుపుతూ స్వాగతం పలికారు నందమూరి బాలకృష్ణ. ఈ వీడియో పట్ల అటు నెటిజన్స్ ఇటు నందమూరి, మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.