Kite Festival: సంక్రాంతి పండగా సందర్భంగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. నేటి నుంచి 15వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కైట్ ఫెస్టివల్ లో 19 దేశాల నుంచి 47మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. మన దేశంలో 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్ లో పాల్గొననున్న 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్.. ఇక, నోరూరించే పిండి వంటలతో స్వీట్ ఫెస్టివల్ సైతం నిర్వహించనున్నారు. దేశ, విదేశాల పిండి వంటలతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందుబాటులో మొత్తం 11 వందల పిండి వంటలు ఉండనున్నాయి.
Read Also: Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి ముగ్గుల పోటీలు.. పాల్గొన్న అందరికీ రూ.10,116 బహుమతి..
అయితే, తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్కృతిని ప్రచారం చేసేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేస్తుంది. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి వచ్చే వారికి ఉచిత ఎంట్రీ ఉంది. ఈ మూడు రోజుల్లో దాదాపు 15 లక్షల మంది సందర్శుకులు వస్తారని సర్కార్ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగే ఈ కైట్స్ ఫెస్టివల్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4గంటలకు ప్రారంభించనున్నారు.