తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరిగి పుంజుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఇక్కడ ఓ వెలుగు వెలిగిన పార్టీ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ దెబ్బతో డీలాపడిపోయింది. ఇక... గడిచిన పదేళ్ళలో రాష్ట్రం నుంచి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందన్న అభిప్రాయం ఉంది రాజకీయవర్గాల్లో. అప్పట్లో టీడీపీలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ నాయకులు ఎక్కువ శాతం బీఆర్ఎస్లోకి తర్వాత కాంగ్రెస్‌లోకి చేరిపోయారు.
ఎస్ఎల్‌బీసీటన్నెల్ మధ్యలో ద్వారం ఏర్పాటుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. సొరంగం మధ్యలో ఒక ఎస్కేపింగ్ పాయింట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో ఎదురవుతున్న ఆటంకాలపై NGRI శాస్త్రవేత్తలు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో.. యాడిట్ ఏర్పాటుపై అధికారులు చర్చిస్తున్నారు. తిర్మలాపూర్ సమీపంలో ఏర్పాటుకు వెసులుబాటు ఉంది. 1994 ఏప్రిల్ 22న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. కాగా.. ద్వారంతో టన్నెల్ తవ్వకం సులభమయ్యే ఛాన్స్ ఉంది. Read…
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి, కేసీఆర్‌తో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ పిల్ దాఖలు చేశారు. నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఈ పిల్ దాఖలు చేసింది.
తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో మరో ముందడుగు పడనుంది. నేడు రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం జరగనుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో ఎంఓయు చేసుకోనున్నారు.
తెలంగాణలో బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే విద్యార్థుల కూడా పుస్తకాలు ముందు వేసుకుని చదువుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల ఫీవర్ మొదలు కాబోతుంది.
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను అధికారులు ఓపెన్ చేశారు. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. ఈ ప్రక్రియ దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని.. అసలు కౌంటింగ్ ప్రక్రియ ఆ తర్వాత మొదలు కానుందని అధికారులు చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. అయితే పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు…
తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది.
వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. "రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడు. కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదు. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట. వంద రోజుల్లో అమలు చేస్తామన్న…
అవసరమైతే రోబోలను పంపి.. రెస్క్యూ ఆపరేషన్ లో వాడుకునే దిశగా ప్రయత్నం చేయాలని సూచించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా సానుభూతి తెలపాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.. ఎస్ఎల్బీసీ టన్నెల్ పరీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 11 కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఈ విపత్తు లో పనిచేస్తున్నాయన్నారు. "ఇది ఒక ప్రమాదం.. ఇది విపత్తు.. అందరం కలిసి సానుభూతి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. హెలికాప్టర్ ఇచ్చి…