Minister Ponguleti: తెలంగాణ అసెంబ్లీలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖల పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ పై ప్రజలు తీర్పు ఇచ్చారు.. మా సభ్యులే కాదు.. మీ వైపు ఉన్న సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు.. ధరణిలో ఏర్పడిన సమస్యలతో తమ భూముల సమస్యలు పరిష్కారం కోసం నా దగ్గరికి పలువురు ఎమ్మెల్యేలు వస్తున్నారు వెల్లడించారు. మేము వచ్చే ఎన్నికల్లో భూ భారతి గురించి చెప్పి ఎన్నికలకు పోతాం.. బీఆర్ఎస్ ధరణి పేరుతో ఎన్నికలకు వెళ్తారా? అని ప్రశ్నించారు. మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు.. ధరణి తెచ్చి రూల్స్ అసలు ఫ్రేమ్ చేయలేదు.. మేము చట్టం తెచ్చి రూల్స్ సిద్ధం చేస్తున్నాం.. మీరు మాకు చెప్పడం ఎందుకు అని క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్ నేతలు కట్టుకథలు చెప్పి, ప్రజల్ని మోసం చేసే పనిలో ఉన్నారు అని మంత్రి పొంగులేటి విమర్శించారు.
Read Also: Suhasini : నాకు ఆరేళ్ల నుంచే ఆ జబ్బు ఉంది.. నటి షాకింగ్ కామెంట్స్
అలాగే, వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థపై గత ప్రభుత్వానికి ఎంత కమిట్ మెంట్ ఉందో ప్రజలకు తెలుసు అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. డబులు బెడ్ రూం ఇస్తాం అని చెప్పింది ఎవరు.. మీరు పింక్ కలర్ వేసుకున్న వాళ్లకు ఇండ్లు ఇచ్చారు.. పేదలకు మేము ఇందిరమ్మ ఇండ్ల ఇస్తున్నాం.. వాళ్ళ మాదిరిగా మేము పార్టీల కార్యకర్తలు ఇవ్వం అని తెలిపారు. తమ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక, ఇందిరమ్మ కమిటీ ఛైర్మన్ సర్పంచ్.. మీలాగా బీఆర్ఎస్ నాయకులను పెట్టలేదు.. సభను పడే పదే తప్పుదోవ పట్టిస్తున్నారు అని మంత్రి పొంగులేటి తీవ్రంగా మండిపడ్డారు.