పని చేస్తుంది ఎవరు.. యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది కూడా తెలుసు.. పార్టీ కోసం సమయం ఇవ్వండి.. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేయకండి.. అలాంటి వారిపై చర్యలు తప్పవు.. నా పని తీరు నచ్చకపోయినా.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఫిర్యాదు చేయొచ్చు.. కానీ, బయట మాట్లాడకండి: మీనాక్షి నటరాజన్
Jana Reddy: కులగణన అంశంలో నా పాత్ర లేదు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గాలి మాటలు మాట్లాడితే కుదరదు అని పేర్కొన్నారు. యెస్తు క్రీస్తు.. చెప్పిన గుణాలు కలిగిన వాడ్ని నేను.. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం నాది..
Karimnagar Graduate MLC: కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల కౌంటింగ్ లో ఎలిమినేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 21 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 77,203 ఓట్లు లెక్కించాల్సి ఉంది.
CPI Party: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఐ నేతల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి చర్చ కొనసాగింది.
గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తుంది అని ఆరోపించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (ఎస్ఆర్ఎస్పీ)లో నీరు తగ్గిన కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశాం అన్నారు. ఇక, మేడిగడ్డలోని ఒక్క బ్లాక్ లో ఒక పిల్లర్ మాత్రమే కుంగితే మాపై బురద జల్లి అధికారంలోకి వచ్చారు అని హరీష్ రావు విమర్శించారు.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. నిన్నామొన్నటి దాకా డిజిటల్ అరెస్ట్‌తో కోట్ల కొల్లగొట్టిన కేటుగాళ్లు ఇప్పుడు రూట్ మార్చారు. న్యూడ్ కాల్స్ పేరుతో సామాన్యుల్నే కాదు.. ఏకంగా ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. వాళ్లను కూడా ముప్పు తిప్పలు పెడుతున్నారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి మొదలుకానున్నాయి. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 4 లక్షల 88 వేల 448 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5 లక్షల 8 వేల 523 మంది…
ప్రొఫెసర్ కోదండరామ్..... పిల్లలకు రాజకీయ పాఠాలు చెప్పే సారు. క్లాస్రూమ్ లెసన్స్‌లో తనకు తిరుగులేదని అనింపించుకున్న ఈ మాస్టారు..... పొలిటికల్ ప్రాక్టికల్స్‌లో మాత్రం బాగా వెనుకబడ్డారన్న టాక్ నడుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటుదామని రంగంలోకి దిగినా సరైన వ్యూహరచన లేక బోల్తా పడుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి... అయితే, గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తామని చెప్పామంటూ కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు.
తెలంగాణలో బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు వివిధ కారణాలు చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మామూలుగా అయితే... ఇది రొటిన్ వ్యవహారంలాగే అనిపించేదిగానీ... పార్టీ ఫిరాయింపుల్ని బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకోవడంతో.... పొలిటికల్ ఫైర్ మొదలైంది. ఆ పది మంది మీద ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ ఓ వైపు సుప్రీం కోర్ట్‌లో పెద్ద యుద్ధమే చేస్తోంది గులాబీ పార్టీ.