Crime News: హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నాగేష్ ను కర్రతో కొట్టి చంపేశాడు అతడి స్నేహితుడు నర్సింగ్.
Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ రోజు (మార్చ్ 6) మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది.
తెలంగాణలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పట్టభద్రులు, ఒక టీచర్ సీట్లో ప్రభావం చూపిన కమలం పార్టీ... మరో చోట చతికిలపడింది. ఓడిపోయిన నల్గొండ టీచర్ సీటు విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదుకాబట్టి అలాంటి ఫలితమే వచ్చిందని అనుకున్నా.... మిగతా రెండు సీట్లలో పరిస్థితి చూస్తే మాత్రం.. ఇక తెలంగాణ మాదేనన్నంత ధీమాగా ఉన్నారట కాషాయ నేతలు
తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల ప్రక్రియకు తెర లేచింది. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చేలోపే అందుకు సంబంధిచిన షెడ్యూల్ విడుదలైపోయింది. ఈనెల 20న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. పదో తేదీ నామినేషన్ దాఖలుకు ఆఖరు. ఈ క్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది.
Uttam Kumar Reddy: గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకి తెలిసి మాట్లాడుతున్నాడో.. తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు.
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో నేతలను నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు కేటగిరీలుగా విభజించింది. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్న వాళ్లు ఒక గ్రూప్ గా.. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూప్.. అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారు మూడో గ్రూప్ గా విభజించిన నటరాజన్.
మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ లైన్ ఎవరు దాటిన వారి పైనా క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం కామన్ అన్నారు. నాకైనా, చిన్నారెడ్డి కైనా, రేవంత్ రెడ్డికి అయినా ఒకే చర్యలు ఉండాలి అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలనుకున్న వారిలో మల్లన్న ఒకరు అని మధుయాష్కీ పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. "మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే సమ్మక్క సారక్క, సీతమ్మ సాగర్, వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరంలో మూడో ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వమని చెప్పండి. అప్పుడు మేము మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉందని నమ్ముతాం.
కేంద్రం ఇస్తోంది.. కానీ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని రేవంత్ అంటున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.. ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "తెలంగాణకు మోడీ 7 జవహర్ నవోదయ విద్యాలయాలు ఇచ్చారు. నా పార్లమెంట్ పరిధిలో జగిత్యాల, నిజామాబాద్ లో ఒకటి చొప్పున రెండు వచ్చాయి. పార్టీలకతీతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాను.