Telangana Heatwave Alert: మార్చి నెల ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
BJP MP Laxman: ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. డబుల్ ఎమ్మెల్సీ గెలిచాం.. డబులింజన్ సర్కార్ ఖాయం అన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాo.. ఎదురులేని శక్తిగా ఎదుగుతామన్నారు.
Congress: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో అతడిపై పార్టీ హైకమాండ్ కి ఫిర్యాదు చేసేందుకు క్యాడర్ రెడీ అవుతుంది. నిన్న కాంగ్రెస్ పార్టీని తిట్టినట్లు సోషల్ మీడియాలో మహిపాల్ రెడ్డికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది.
Telangana Govt: టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక, 2.5 శాతం డీఏను రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
KCR: నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు గులాబీ బాస్. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉండటంతో కేసీఆర్ ఇవాళ శాసనసభా సభ్యులు మీటింగ్ ఏర్పాటు చేశారు.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు (మార్చ్ 7) ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా వెళ్లబోతున్నారు.
తెలంగాణ కేబినెట్లో బెర్త్ కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు తొక్కని గడప లేదు... మొక్కని దేవుడు లేడు అన్నట్లుగా ఉందట వ్యవహారం. మంత్రి పదవుల కోసం ఎవరి వ్యూహాల్లో వారు మునిగి తేలుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్లో కయ్యం ముదురుతోందట. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో మీటింగ్ గరగరంగా సాగినట్టు తెలిసింది.నేతల వ్యవహార శైలిపై ఫిర్యాదుల వెల్లువలా వచ్చినట్టు తెలిసింది.ఆమె ముందే పరస్పరం కౌంటర్స్ వేసుకున్నారట నాయకులు. పక్క జిల్లాకు చెందిన నేత ఒకరు పార్టీని కులాల వారిగా విభజిస్తున్నారని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం ,గ్రూప్ లుగా మారడానికి సదరు నేతే కారణమని ముందు పేరు చెప్పకుండా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి అఖండ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఈ విజయం తెలంగాణ సమాజానికి, ఉపాధ్యాయులకు అంకితం ఇస్తున్నాం. రెండు ఎమ్మెల్సీలు ఏక కాలంలో రావడం చాలా సంతోషం. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని ఆదరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన…