Telangana Govt: రిటైర్డ్ ఉద్యోగులపై తెలంగాణ సర్కార్ వేటు.. 6,729 మంది తొలగింపుకి ఆదేశాలు!
- రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం..
- ఒక్క జీవో.. వేల మందికి ఉద్వాసన..
- అటెండర్ నుంచి ఐఏఎస్ ల వరకు వేటు..
- పదవి విరమణ చేసిన కాంట్రాక్ట్ పై పని చేస్తున్న వారిపై వేటు..
- లిస్టులో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సహా ముఖ్య అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt: రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే ఆర్డర్ తో దాదాపు 6,729 మంది పైన వేటు పడింది. ప్రభుత్వంలోని పలు శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టుపై పని చేస్తున్న వారిపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో అటెండర్ నుంచి ఐఏఎస్‌ల వరకు ఉన్నారు. ఈ లిస్టులో హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తో సహా వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, కన్సల్టెంట్ ఇంజినీరు బీఎల్‌ఎన్ రెడ్డితో పాటు 10 మంది ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మార్చ్ 31వ తేదీలోపు అన్ని శాఖల్లోని రిటైర్డ్ ఉద్యోగులను గుర్తించి తొలగించాలని వెల్లడించారు. అయితే, వీరి ప్లేస్ లో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారు.
Read Also: Surya Grahan In India : రేపే ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం.. సమయం, వివరాలు ఇవే..
Also Read
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
- Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
- Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
కాగా, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు మున్సిపల్ శాఖ పరిధిలోని 177 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరందరిని తక్షణమే తొలగిస్తున్నట్లు అందులో స్పష్టం చేశారు. అయితే, ఈ జాబితాలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, మెప్మా, కుడా, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మెట్రో రైల్, రెరా, వైటీడీఏ.. ఇలా వివిధ విభాగాల్లో పని చేస్తున్న విశ్రాంత ఐఏఎస్ లు, ఆర్డీవోలు, డీఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్లతో పాటు పలు క్యాడర్లకు చెందిన అధికారులు సైతం ఉన్నారు. మరోవైపు, విద్యుత్త్ శాఖలో మరికొందరు డైరెక్టర్లను కూడా తొలగించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది.
తాజావార్తలు
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..