తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్‌తో ఏఐసీసీ పెద్దలు ఫోన్లో మాట్లాడారు. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 8.15 గం.కు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.
నిజామాబాద్ జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ... దాన్ని ఎక్కడ పెట్టాలన్న విషయంలో రాజకీయ రాద్ధాంతం నడుస్తున్నట్టు తెలిసింది. కేంద్రం మంజూరు చేసిన స్కూల్‌ను తాను సూచించిన ప్రాంతంలో ప్రారంభించమని పట్టుబడుతున్నారట నిజామాబాద్ ఎంపీ అర్వింద్. జక్రాన్ పల్లి మండలం కలిగోట్‌లో పెట్టాలంటూ... ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారట ఎంపీ.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఏఐఎమ్ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్వాగతిస్తున్నాము. కేంద్రం పారదర్శకంగా లేదు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. RRR మంజూరు...మెట్రో మంజూరు కోసం ..బాపు ఘాట్ అభివృద్ధికి ... మూసి ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని అడిగారు.
రంగారెడ్డి జిల్లా టంగుటూర్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతంతో శంభారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. సినిమా షూటింగ్ కోసం టంగుటూరులో లొకేషన్ చూపిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతం కావడంతో శంబారెడ్డి స్పాట్లో ప్రాణాలు కోల్పోయాడు.
తెలంగాణ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా మహిళలు నష్టపోతున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టిన కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు.