హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశలో మరో అడుగు పడింది. గ్లోబల్ టెక్నాలజీ సంస్థ ‘క్లియర్‌టెలిజెన్స్’ తన ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్‌ను తాజాగా హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో ప్రారంభించింది. క్లియర్‌టెలిజెన్స్ సంస్థను తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఈవో ఓవెన్ ఫ్రీవోల్డ్, మేనేజింగ్ పార్టనర్ అనీల్ భరద్వాజ్, హరికృష్ణ (డైరెక్టర్), ఎంఎం ఇన్ఫో టెక్నాలజీస్ ఫౌండర్ మురళి (నార్త్ కరోలినా), శ్రీధర్ సుస్వరం (జీఎం అండ్ డైరెక్టర్) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. టెక్నాలజీ అంటే హైదరాబాద్ వైపు ప్రపంచం చూసేలా చేయడమే తమ లక్ష్యం అని, పరిశ్రమలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఏఐ, డేటా ఇంజనీరింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సొల్యూషన్స్ తదితర రంగాల్లో సేవలు అందించే క్లియర్‌టెలిజెన్స్ సంస్థ తమ ఇండియా శాఖను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ‘ఉగాది తర్వాత మహేశ్వరంలో ఏఐ సిటీ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇక్కడే 200 ఎకరాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏఐ సిటీని నిర్మిస్తాం. ఈ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో తెలంగాణ హబ్‌గా మారుతుంది. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలను ప్రారంభించాం. త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్‌లోనూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. టెక్నాలజీ అంటేనే ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా చేయడమే మా లక్ష్యం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటాం. పారిశ్రామిక వేత్తలు ఎదిగితే రాష్ట్రం కూడా వృద్ధి చెందుతుంది. ప్రతిభ గల యువతే తెలంగాణకు ఉన్న అతి పెద్ద ఆస్తి. రోజురోజుకీ మారుతున్న టెక్నాలజీ కారణంగా అనేక సవాళ్లు తలెత్తుతున్నాయి, వాటికి పరిష్కారాలను కనుక్కునేందుకు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది’ అని తెలిపారు. క్లియర్‌టెలిజన్స్ ఆఫీస్ హైదరాబాద్‌లో ప్రారంభించడానికి ప్రధాన భూమికను ఫోషించినటువంటి మురళి, హరికృష్ణకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఒవెన్ ఫ్రీవోల్డ్ మాట్లాడుతూ… ‘క్లియర్‌టెలిజన్స్ ఆఫీఫియల్‌గా ఇంటర్నఫనల్ ఆఫీస్ ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ లాంటి ఒక వైబ్రెంట్ సిటీ, అద్భుతంగా అభివృద్ది చెందుతున్న సిటీలో ప్రారంభించడం ఏంతో ఆనందం. ఐటీశాఖ మంత్రికి, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్వవాదనలు. తెలంగాణా ప్రభుత్వం సహకారం, గైడెన్స్‌తోనే ఇది సాధ్యపడింది. ఈ కంపెనీ పీపుల్ ఫస్ట్ ఆప్రోచ్‌తో పని చేస్తుంది. మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇవాళ 50 మందితో ప్రారంభమైన ఇండియా డవలెప్‌మెంట్ సెంటర్.. వందల సంఖ్యలో ఉద్వోగాల లక్ష్యంతో ముందుకు వెళుతుంది. త్వరలోనే కంపినీ భహుళ అంతస్తుల భవనం నిర్మించే దశకు చేరుకోవడమే మా లక్ష్యం’ అని చెప్పారు.
మురళి మాట్లాడుతూ… ‘క్లియర్‌టెలిజన్ప్ ఇండియాలో ఏ ప్రాంతంలో మా కంపెనీ స్టార్ట్‌చేస్తే బాగుంటిందని నన్ను సంప్రదించినప్పుడు ఓ తెలంగాణా బిడ్డగా హైదరాబాద్ నగరంను రికమండ్ చేశా. వాళ్లవంతు రీచర్చ్‌లో భాగంగా బెంగుళూరు వెళ్లారు కానీ..హైదరాబాద్‌నే ఎంచుకున్నారు. దానికి ప్రధాన కారణం తెలంగాణా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఎకో సిస్టం. ప్రథానంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు కొత్త కంపెనీలకు ఇస్తున్న సహాకారం నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. మంత్రి గారికి నా ప్రత్యేక కృతజ్జతలు. ఓవెన్ చెప్పినట్టు ఇది జస్ట్ లాంచింగ్. దీని ద్వారా వందల మందికి ఉద్వోగ అవకాశాలు కలుగుతాయని విశ్వశిస్తున్నా’ అని పేర్కొన్నారు. అనీల్ భరద్వాజ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్వవాదాలు తెలిపారు. హైదరాబాద్ గ్లోబుల్ టేక్నాలజీ పవర్ హౌస్‌గా మార్చడంలో ప్రధాన భూమికను ఫోషిస్తున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. టెక్నాలజీతో ముడిపడి ఉన్న ఈ నగరంలో మా ఈ క్లియర్‌టెలిజన్స్ భాగస్వామి అవ్వడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని నమ్ముతున్నానన్నారు.