Peddi: టీజర్ వచ్చేస్తోంది.. వచ్చే వారం నుంచే అసలైన ఆట!
- ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్
- చివరి దశకు చేరుకున్న షూటింగ్
- వచ్చే వారం నుంచి టీజర్ వర్క్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రగ్గడ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. కానీ, ఇంకా ఈ సినిమా షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ పెద్ది షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పాల్గొనాల్సిన టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. చరణ్ తన పాత్రకు సంబంధించిన డైలాగ్స్ మరియు కీలక సన్నివేశాల చిత్రీకరణను దాదాపుగా ముగించినట్టుగా సమాచారం. మరోవైపు ఆయన లేని కొన్ని చిన్నపాటి ప్యాచ్ వర్క్ సీన్లను సెకండ్ యూనిట్ చిత్రీకరిస్తోంది. ఇక బ్యాలెన్స్ ఉన్న ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను లాస్ట్ షెడ్యూల్‌లో చిత్రీకరించబోతున్నారు. దీనితో పాటు, ఓ స్పెషల్ సాంగ్ షూట్ కూడా చేయనున్నారు. ఇక్కడితో సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోయినట్టేనని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం.
Also Read: Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ఈరోజు ట్రైలర్, రేపు రచ్చ రచ్చే!
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఎట్టిపరిస్థితుల్లోను అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు దర్శకుడు బుచ్చిబాబు. అందుకే ఓ వైపు షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. అలాగే, ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టడానికి రెడీ అవుతోంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో పెద్ది టీజర్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్‌కు సంబంధించిన పనులు వచ్చే వారం నుండి మొదలు పెట్టనున్నట్టుగా సమాచారం. సినిమాపై అంచనాలను పెంచేలా పవర్‌ఫుల్ టీజర్ కట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఆరోజే పెద్ది టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ది పాటలు సంచలనం సృష్టించాయి. ఇప్పుడు రాబోతున్న టీజర్ అంతకుమించిన అంచనాలు పెంచేలా ఉంటుందనే టాక్ అయితే వినిపిస్తోంది. ఏదేమైనా.. సమ్మర్ కానుకగా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!