MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
Payal Shankar: ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోడీకి అసెంబ్లీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలని బీజేపీ డిప్యూటి ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అన్నారు. ఎన్నో ఏండ్ల కల ఎస్సీ వర్గీకరణ నేడు సహాకరమైంది.. సుప్రీం కోర్టు వరకే పరిమితం అవుతుందనుకున్న వర్గీకరణ నేడు ఫలించిందన్నారు.
CM Revanth Reddy: బీసీ నేతలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బలహీన వర్గాల లెక్క తేలాలని కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు.. బీసీలు తెలిపే అభినందనలు నాకు కాదు రాహుల్ గాంధీకి అందివ్వాలన్నారు.
ఎన్నికల పారదర్శకతపై పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలను డాటాను విశ్లేషించింది. మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది అఫిడవిట్లను పరిశీలించింది. ఈ మేరకు ఓ నివేదిక తయారు చేసింది. గత ఐదు సంవత్సరాలలో వేరే పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి.. పార్టీ మారిన 63 మంది ఎమ్మెల్యేల జాబితా కూడా రూపొందించింది. ఎమ్మెల్యేల నేర నేపథ్యం, వారి ఆస్తుల వివరాల గురించి…
మూసీ ప్రక్షాళనపై తెలంగాణ శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు కీలక విషయాలు వెల్లడించారు. మూసీ ప్రక్షాళన జరగకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అయినా… ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగేయదని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనకు అన్ని పార్టీలు సహకరించాలి. డీపీఆర్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. మూసీ ప్రక్షాళన పేరిట బీఆర్ఎస్ పార్టీ హడావుడి చేసింది. కానీ.. చేసిందేం లేదు. చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూపించడం సరి కాదు. ప్రతి…
ఇటీవల దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. ఇళ్లలోకి చొరబడి భారీగా దోచుకెళ్తున్నారు. మాటలతో మభ్యపెట్టి మెడలో బంగారు గొలుసులను కూడా మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. ఫిలీం నగర్ లో భారీ చోరికి పాల్పడ్డారు. ఫిలిమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ డైమండ్ హిల్స్ లో ఓ ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకుంది. ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి 34 తులాల బంగారు ఆభరణాలు, 4.5 లక్షల నగదు, 550 కేనేడియన్…
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. దాదాపు 800కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. సభకు ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడంతో ఆల్ హ్యాపీస్ అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అలా అనుకుంటుండగానే... వాళ్ళకో లోటు కనిపించిందట. నియోజకవర్గ కాంగ్రెస్‌లో కీలక నాయకురాలు ఇందిర ఈ కార్యక్రమలో ఎక్కడా ఎందుకు కనిపింలేదన్న చర్చ మొదలైంది
2014 నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజును గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు అచ్చంపేట ఓటర్లు . నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న గువ్వల.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగబలం, అర్దబలంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా కనుసన్నల్లో పెట్టుకుని నియోజకవర్గంలో నియంతలా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది.
బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రాజా సింగ్... ఈ మధ్య పార్టీ విషయంలో అంతకు మించి అన్నట్టు ఉంటున్నారట. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రాజా.. కొందరు రాష్ట్ర పార్టీ నాయకుల మీదే డైరెక్ట్ అటాక్ చేస్తూ... అయామ్ ఫైర్.. అయామ్ ది ఫైర్ అంటున్నారట. నన్ను పార్టీ నుంచి పంపించే కుట్ర చేస్తున్నారు, ఏం.. ఉండనీయదల్చుకోలేదా అంటూ పబ్లిక్‌గానే ప్రశ్నిస్తున్నారాయన.
Ponnam Prabhakar: బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాలకు శుభ సూచిక.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు.