* నేడు సీఎం చంద్రబాబుతో ఆర్థిక సంఘం భేటీ.. ఏపీ ఆర్థిక పరిస్థితిని సంఘానికి వివరించనున్న చంద్రబాబు..
* నేటి నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు జపాన్ లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. టోక్యో, మౌంట్ పుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటన.. ఒసాకా వరల్డ్ ఎక్స్ పో-2025లో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం.. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు.. పెట్టుబడులు, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై చర్చలు..
* నేడు సుప్రీంకోర్టులో కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై విచారణ.. ఈ కేసుపై అఫిడవిట్ దాఖలు చేసిన సీఎస్ శాంతికుమారి..
* నేడు యూరప్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 20న తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న చంద్రబాబు.. తిరిగి ఈ నెల 22న ఢిల్లీకి చేరుకుని పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం..
* నేటి నుంచి పోలవరంలో పర్యటించనున్న కేంద్ర నిపుణుల బృందం.. ప్రోజెక్ట్ వద్ద నిల్వ ఉంచిన మట్టి నిల్వలను సేకరించనున్న నిపుణులు..
* నేడు ఆదోని వైసీపీ మున్సిపల్ ఛైర్ పర్సన్ శాంతపై అవిశ్వాస తీర్మానం.. అవిశ్వాసంపై 41 మంది కౌన్సిలర్లకు గాను 34 మంది సంతకాలు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..
* నేడు సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టంపై విచారణ.. వక్ఫ్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ.. మధ్యాహ్నం 2గంటలకు విచారించనున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం..
* నేడు దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు.. దేశంలోని అన్ని ఈడీ ఆఫీసుల ఎదుట ఆందోళనలకు పిలుపు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొనాలని అన్ని రాష్ట్రాల పీసీసీలకు ఏఐసీసీ లేఖ..
* నేడు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్..