యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో మరో 6 ప్రదేశాలు చేరాయి. అందులో తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్లో ఉన్న నిలువురాళ్లకు చోటు దక్కింది. అంతేకాకుండా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని బుండేలాల రాజభవన కోటలు సహా ఆరు ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం భారతదేశ తాత్కాలిక జాబితాలో చేర్చిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం తెలిపారు.
తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలు స్వీకరించబోతోంది టీటీడీ.. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై సోమవారం, మంగళవారాల్లో బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు టీటీడీ అధికారులు.. ఇక, బుధవారం ,గురువారం రోజుల్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.
Payal Shankar: జనాభా లెక్కన రిజర్వేషన్లు ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన అని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. పూలే వారసులం అయిన బీసీలకు చదువులు దక్కడం లేదు.. తాము కరిగిపోతూ సమాజానికి సేవ చేస్తున్నాం.. అవకాశాలు మాత్రం బీసీలకు రావడం లేదు.. గత పాలకులు 7లక్షల కోట్ల అప్పులు చేశారు.
అవినీతి రారాజు కడియం శ్రీహరి కరెప్షన్ గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కడియం శ్రీహరి తన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక, అవినీతి గురించి మాట్లాడే హక్కు కడియంకు లేదు.. నేను ఎగురుతా, దుకుతా, పాడుతా నీకేంటి అని ప్రశ్నించారు. గత 15 ఏళ్లలో అభివృద్ధి జరుగలేదనడం హాస్యాస్పదం.. కళ్ళు లేని కబోది కడియం... అది నోరా మున్సిపాలిటీ మొరా అని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.
Konda Surekha: తెలంగాణ అసెంబ్లీలో లాబీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశాం.. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది.. కానీ, యాదగిరిగుట్ట బోర్డుకు ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుంది అని తెలిపారు.
Harish Rao: పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని గత శాసన సభలో నిర్ణయించామని తెలిపారు. సీపీఐ సభ్యులు కునంనేని సూచన చేశారని అన్నారు. రాజకీయాలు కలుషితం అయ్యాయో.. ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదు. పొట్టి శ్రీరాములు త్యాగం.. దేశభక్తిపి గుర్తించాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. Also Read:Orry: చిక్కుల్లో ఓర్రీ.. వైష్ణో దేవి ఆలయం దగ్గర మద్యం సేవించడంపై ఎఫ్ఐఆర్ తెలంగాణ విభజన…
మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడని అన్నాడు. ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీ గా ఉన్నాడని వెల్లడించాడు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము…
కౌన్సిల్ ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన తెలిపారు. మెడలో మిర్చి దండలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు సమస్యలు పరిష్కరించాలని రూ. 25వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైంది. ధర లేక ఈ సీజన్లో 2లక్షల 40 వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతోంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. Also Read:Ponnam Prabhakar:…
సమ్మర్ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు ఈత కోసం స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్తుంటారు. ఈత నేర్చుకోవడం కోసం కొందరు, ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు మరికొందరు స్విమ్మింగ్ పూల్ కు వెళ్తుంటారు. అయితే ఇటీవల స్విమ్మింగ్ కోసం వెళ్లిన వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మీర్పేట్ పరిధిలో ఈత కోసం స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళిన హసన్ అనే వ్యక్తి ప్రాణాలు…