Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ లను భారత్ కు రప్పించేందుకు లైన్ క్లియర్ అయింది.
Telangana Budget: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి సుమారు 3. 20 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ఆయన ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
Cabinet Meeting: నేడు (మార్చ్ 19న) తెలంగాణ కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ లో జరగనుంది. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు సమావేశం అయ్యి.. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది.. బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేసిన సెలబ్రిటీలు ఇప్పుడు వణికి పోతున్నారు.. సినీ రాజకీయ టీవీ రంగాన్ని చెందిన నటీనటులు బెట్టింగ్ యాప్‌ల కొరకు ప్రచారం చేశారు.. దీనికి తోడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కల్పించారు.. దీనికి తోడు మంచు కుటుంబంలో సెన్సేషనల్ అయిన మంచు లక్ష్మి కూడా బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేశారు..
నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా నాగం వర్షిత్ రెడ్డి నియామకం కమల దళంలో కల్లోలం రేపుతోందట. నియామకం తర్వాత రేగిన అసమ్మతి జ్వాలల్ని ఆర్పేందుకు అధిష్టానం ఎంతగా ప్రయత్నిస్తున్నా... తిరిగి ఎక్కడో ఒక చోట రేగుతూనే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వర్షిత్ రెడ్డి మొదటి నుండి క్యాడర్‌ను కలుపుకుని పోవడం లేదని, ఏకపక్ష నిర్ణయాలతో చేటు చేస్తున్నారన్నది ఆయన వ్యతిరేకుల ప్రధాన ఆరోపణ.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తిరగాలని డిసైడయ్యారు. అన్ని జిల్లాలకు వెళ్ళి, పార్టీ మీటింగ్స్ పెట్టి కేడర్‌లో ఉత్సాహం నింపాలన్నది ప్లాన్ అట. సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించేలా కార్యాచరణ ఖరారైందట
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కి మల్లన్న సాగర్ నిర్వాసితులు బహిరంగ లేఖ రాశారు. రేపు అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. లేకపొతే రేపు మధ్యాహ్నం ఫామ్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు.
Ponnam Prabhakar: యాదగిరి గుట్ట టెంపుల్ పై శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధి చేశామని చెప్తున్నారు.. మా జిల్లా దేవాలయాలపై ప్రకటనలు చేశారు.. కానీ, ఎక్కడా అభివృద్ధి జరగలేదు అని తెలిపారు.