తెలంగాణలో ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు రెడీ అయ్యారు. ఈ నెల 07 నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం అని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండు పరిసరాలను సందర్శించి, ప్రయాణికులతో ముచ్చటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం, సీఎం ఆదేశాల మేరకు 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని అన్నారు.
Also Read:SridharBabu : దిల్ రాజు ‘లోర్వెన్ AI’ స్టూడియో నెక్ట్స్ లెవల్ కెళ్లాలి : సినిమాటోగ్రఫీ మంత్రి
ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రజా పాలన ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. 10 సంవత్సరాలుగా ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుంది. కార్మికులు కూడా సహకరించాలి అని కోరారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం అనే మూడు ముఖ్య ఉద్దేశాల మీద సంస్థ నడుస్తోంది. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఆర్టీసీ ఇప్పుడే ముందుకు వెళ్తున్న తరుణంలో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.