99 శాతం మంది లాక్‌డౌన్‌ను సహకరిస్తున్నారని తెలిపారు హైదరాబాద్ పోలీస్ కమిషన్ అంజనీ కుమార్.. పాతబస్తీ, సౌత్ జోన్, సెంట్రల్ జోన్లో లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షించిన ఆయన.. పాతబస్తీ మదిన చెక్ పోస్ట్‌ను పరిశీలించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో లాక్ డౌన్ అమలు అవుతుందని.. 99 శాతం ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారని.. కేవలం 1 శాతం మంది ప్రజలు, యువకులు మాత్రమే అనవసరంగా బయటికి వస్తున్నారని.. అలాంటి వారిని గుర్తించి…
కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వ్యాక్సినేషన్ వేగవంతం చేసే దిశగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ను అనుమతి ఇచ్చిన సర్కార్.. మరోవైపు కరోనా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కొనసాగిస్తుంది.. దీనిలో భాగంగా.. ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు.. రేపటి నుండి మూడు రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్ ఉంటుందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. సూపర్ స్ప్రైడర్ల లో భాగంగా 50 వేల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రేపటి నుండి కోవిడ్…
తెలంగాణ రాజకీయాలు వేడివాడిగా సాగుతున్నాయి. ఈటల నెక్స్ట్ ఎలాంటి అడుగు వేస్తారని సమస్త తెలంగాణ ప్రజల్లో ఓ ప్రశ్న మెదులుతోంది. మొన్నటి వరకు సొంత పార్టీకే ఓటు వేసిన.. ఈటల రాజేందర్ BJPలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకు గాను జూన్ 6 వ తేదీ ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ప్రధాని మోడీ,అమిత్ షా,నడ్డాల అపాయింట్ మెంట్ తేదీ కోసం ఈటల ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. జూన్ 2 న ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3527 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 571044 కి చేరింది. ఇందులో 530025 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27793 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 19 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
కరోనా మహమ్మారి ఓ వైపు కల్లోలం సృష్టిస్తే.. మరోవైపు.. అదే అదునుగా అందినకాడికి దండుకుంటూ.. సామాన్య, మధ్య తరగతి ప్రజల ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు.. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి 66 ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు అందగా.. అన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.. ఇక, మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలను ప్రారంభించింది సర్కార్… బంజారాహిల్స్ లోని విరించి ఆస్పత్రికి కోవిడ్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఇక…
తెలంగాణ రాష్ట్రం ప్రతీ ఏటా రూ.3,439. కోట్లు అంటే 2.102 శాతం ఆదాయం కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. 43వ జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. మాట్లాడుతూ.. న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాదన్నారు.. జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి ఎక్సైజ్, పెట్రోల్ అండ్ డీజిల్ మాత్రమేనని.. కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వస్తోంది సెస్, సర్ ఛార్జిల రూపంలోనే అన్నారు హరీష్‌రావు.. గత బడ్జెట్లో కేంద్ర…
తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయక తప్పదు అంటున్నాయి ఉన్నత విద్యా మండలి వర్గాలు. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక 15 రోజుల గడువు ఇచ్చి ఎంసెట్ నిర్వహిస్తాము అని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం జులై 5 నుండి 9 వరకు ఎంసెట్ జరగాలి. డిగ్రీ పరీక్షలు పూర్తయ్యాకే డిగ్రీ తో ముడి పడి ఉన్న కామన్ ఎంట్రెన్స్ లు నిర్వహిస్తారు.…
ధాన్యం కొనుగోళ్లల్లో ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది యాసంగి రికార్డును దాటాయి ధాన్యం కొనుగోళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది 2014-15లో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా… ఈఏడాది 10 లక్షల మంది రైతుల నుండి 12,247 కోట్ల విలువచేసే 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. కానీ గత ఏడాది ఇదే సమయానికి 56.82 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు…
కరోనా వ్యాక్సిన్ల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్… వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం కేంద్రం వద్దే ఉంచుకుందని.. నిబంధనతో రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. 15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారని మండిపడ్డ ఆయన.. కంపెనీలు కూడా కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించాయని, రాష్ట్రాలకు అనుకున్నంత వ్యాక్సిన్ సప్లై కూడా లేదన్నారు. ఇక, కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడి చర్యల్లోనూ కేంద్రానికి ముందు చూపు…