ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ విజ్ఞప్తి చేశారు. అందులో తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం. లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశమవుతోందని… లాక్ డౌన్ పై తన వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నానని పేర్కొన్నారు. కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు…దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయని తెలిపారు.…
మంత్రుల పిఏ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రామ్ గోపాల్ అనే వ్యక్తి పై పిడియాక్ట్ నమోదు అయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానంటూ పేద ప్రజలను మోసం చేస్తున్నాడు విశాఖపట్నంకు చెందిన రాంగోపాల్. అంతే కాదు కేంద్ర ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీకి పాల్పడ్డ రాంగోపాల్…ఓ యువతిని ప్లాట్ల పేరుతో మోసం చేసి భారీగా డబ్బులు తీసుకున్నాడు. ఏపీకి చెందిన ఓ మంత్రి పీఎం అంటూ పలువురు దగ్గర కూడా డబ్బులు వసూలు…
తెలంగాణ సిఎం కెసిఆర్ కు రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. తన అరెస్ట్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఒక ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసంచాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో) పట్టించుకోలేదని వెల్లడించారు. అరెస్టు చేసే ముందు తన ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలన్న నిబంధనను కూడా పట్టించుకోలేదన్నారు. ఆ…
ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపు, తదితర అంశాల మీదపై కేబినెట్ చర్చించనున్నది. రాష్ట్రంలో ఇవాళ్టితో 18 రోజుల లాక్ డౌన్ ముగియనుంది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వీక్ ఎండ్ లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ వైపు అడుగులు అడుగులు వేస్తోంది ప్రభుత్వం.…
రైతులకు తెలంగాణ శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. పార్ట్-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపింది. జూన్ 10ని కట్టాఫ్ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్లో…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,982 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,74,026 కి చేరింది. ఇందులో 5,33,862 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,917 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 21 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
జగిత్యాల జిల్లాల రాయికల్ లో గర్భం దాల్చిన బాలిక ఘటన చోటు చేసుకుంది. దీని పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైనట్లు తెలిపారు రాయికల్ పోలీసులు. ఐదు రోజులుగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శిశు సంక్షేమ శాఖ అధికారులు, బాలల సంక్షేమ సమితి అధికారులు విచారణ జరిపారు. ఈనెల 25న బాలిక ఇంటికి వెళ్లగా ఇంట్లో లేక పోవడంతో జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో బాలికకు చికిత్స…
టీఆర్ఎస్ పార్టీలో ఈటల అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి… ఇవాళ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామంలోని చేనేత సహకార సంఘం భవనంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు.. అయితే, ఈ సమావేశంలో జై ఈటెల నినాదాలను హోరెత్తించారు కొందరు కార్యకర్తలు.. మండల స్థాయి టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ వ్యక్తులు ముఖ్యం కాదు మనకు పార్టీ ముఖ్యం అని వ్యాఖ్యానించడంతో.. ఈటల వర్గీయుల్లో…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సమయంలో.. ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. దీంతో.. త్వరిత గతిన ఆక్సిజన్ తరలింపునకు ప్రత్యేక రైళ్లు, విమానాలు నడుపుతోంది ప్రభుత్వం.. అయితే, ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. శనివారం హైదరాబాద్ నుండి చత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ కి వెళ్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ల గూడ్స్ రైలులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.. అది గమనించిన సిబ్బంది.. పెద్దపల్లి జిల్లా సమీపంలోని 38వ గేటు వద్ద…
దేశంలో ప్రజల ఇబ్బందులకు ప్రధాని మోడీనే బాధ్యత వహించాలని సిపిఐ రామకృష్ణ అన్నారు. కరోనా కంట్రోల్ చేసింది మోడీ వల్లే నంటూ గతంలో బిజెపి తీర్మానం చేసిందని..సెకండ్ వేవ్ లో వైఫల్యానికి మాత్రం మోడీ కారణం కాదంటారా ? అని ఫైర్ అయ్యారు. ఎన్నికలు నిర్వహణ, కుంభమేళా పెట్టడం వల్లేనని..దేశంలోనే యాభై శాతం కరోనా కేసులు నమోదయ్యాయని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలలో విజయమే ముఖ్యంగా మోడీ పని చేశారని..పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది సార్లు…