కనిపించిన వాళ్లని కనిపించినట్టు లాఠీలతో ఇరగ్గొడుతోన్న లాఠీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. గ్యాంగ్ లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, కొంతకాలంగా బాలాపూర్ షాహీన్‌నగర్ లో అర్ధరాత్రి లాఠీలతో విరుచుకుపడుతోంది ఒక గ్యాంగ్. అర్ధరాత్రి వేళ రోడ్ల మీద కనిపించిన వారిని కనిపించినట్టు లాఠీలతో బాదుతోందీ ముఠా. ఇటీవల ముఠా ఆగడాలు మరీ పెచ్చుమీరిపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా నలుగురు బాలాపూర్ బిస్మిల్లా కాలనీ వాసులను పోలీసులు…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సెక్రటేరియట్ నుండి గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, సమీక్షించారు. వరి సేకరణ, సూపర్ స్ప్రెడర్ వర్గాలకు టీకాలు వేయడం, విత్తనాలు, ఎరువుల సరఫరా మరియు లభ్యత ఏర్పాట్లపై ఈ సమీక్ష నిర్వహించారు. త్వరలో రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించనున్నందున రాబోయే 6 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా…
తెలంగాణలో అమలు చేస్తున్న కఠిన లాక్డౌన్ నిబంధనలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. సుమారు నెల రోజుల తర్వాత తెలంగాణలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఆసుపత్రిలో అరగంటకే బెడ్లు దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు కోవిడ్ కు వచ్చే కాల్స్ కూడా పూర్తి మొత్తంలో తగ్గాయి. రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రోడ్లపై రాకపోకలతో…
జమున హ్యాచరీస్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. హ్యాచరీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది.. మాసాయిపేట భూములపై హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్ భార్య జామున.. సర్వే నోటీస్ ఇవ్వడానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారామె.. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. జమున హ్యాచరీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది.. ఇక, విచారణ సందర్భంగా.. కరోనా సమయంలో సర్వేను కొన్ని రోజులు వాయిదా వేసేందుకు సిద్ధమన్న…
కరోనా మహమ్మారి విరుచుకుపడుతోన్న సమయంలో.. ఎవ్వరైనా సరే తమకు ఏంటి? అన్నట్టుగా.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి.. కొందరు లక్షలు చదివించినా.. తమవారి ప్రాణాలు దక్కలేదని వాపోతున్నారు.. కనీసం బిల్లులు కూడా వేయకుండా.. వైట్ పేపర్లపై రాసిచ్చి డబ్బులు గుంజేవారు కూడా లేకపోలేదు.. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.. దీంతో.. ఆ 88 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని.. 24 నుంచి 48 గంటల్లో సమాధానం…
సీఎం కేసీఆర్ పై బిజేపి నేత విజయశాంతి మరోసారి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ లో అణువణువునా అహంకారం ఉందని మండిపడ్డారు. “తెలంగాణ సీఎం కేసీఆర్ గారిలో అణువణువునా నిండిన అహంకారం ఫలితం ఏమిటో నేటి మీడియా కథనం చూస్తే అర్థమవుతుంది. విపక్షాలు ఎంతగా చెప్పినా… ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా వినకుండా పట్టుదలకు పోయి ఈ సర్కారు నిర్వహించిన పలు ఎన్నికల వల్ల పలువురు ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది కరోనా బారిన పడి…
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబసభ్యులపై వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.. అయితే, మాసాయిపేట భూముల పై మరోసారి హైకోర్టును ఆశ్రయించారు ఈటల రాజేందర్ భార్య జామున.. సర్వే నోటీస్ ఇవ్వడానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారామె.. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది.. కాగా, ఈనెల 5న సర్వే నోటీసు ఇచ్చారు అధికారులు.. ఆ నోటీసును సవాల్ చేస్తూ ఈటల రాజేందర్…
ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తున్నాడన్న వార్తలతో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో వస్తే మరో ఉప్పెన తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తనను సంప్రదించకుండా ఈటల రాజేందర్ ను ఎలా బీజేపీలోకి ఆహ్వానిస్తారని నిలదీశారు పెద్దిరెడ్డి. ఒక్క వర్గం వ్యక్తులు మాత్రమే ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారని..ఆయనతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా తనను అడగకపోవడం శోచనీయమన్నారు.ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులకు… నాకు…