పీసీసీ చీఫ్ పేరు ప్రకటిస్తే.. టీ కాంగ్రెస్‌లో ప్రకంపనలేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీసీసీ చీఫ్ పేరు ప్రకటిస్తే.. కాంగ్రెస్‌లో ప్రకంపనలేనా? ఆయనకు పదవి ఇస్తే పార్టీలో ఉండలేమన్న బెదిరింపులు దేనికి సంకేతం? ఇంతకీ అవి బెదిరింపులా.. నిజంగా డిసైడ్ అయ్యారా? పీసీసీ పంచాయితీ కంటే.. ప్రకటన తర్వాత జరిగే లొల్లే ఎక్కువగా ఉంటుందా? తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? లెట్స్
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతామని కొందరు హెచ్చరిక?
Also Read
తెలంగాణ పీసీసీని కొలిక్కి తెచ్చే పనిలో ఉంది కాంగ్రెస్ అధిష్ఠానం. కొత్త పీసీసీ చీఫ్ ఎవరనేది ఇప్పటికే ఖారారైనట్లు చెబుతున్నారు. ఎంపీ రేవంత్ నూతన సారథిగా వస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌పార్టీలో సీనియర్ నాయకులంతా రచ్చ మొదలుపెట్టారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతామని AICC తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. దీంతో పార్టీలో ఏం జరుగుతుంది? ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అని కొందరు విశ్లేషణలు చేస్తున్నారట.
నేతలు జంప్ చేయకుండా అధిష్ఠానం చర్యలు!
కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కొందరు పార్టీ నాయకులు హైకమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. వాటిని చూసిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ.. అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని ఇంఛార్జ్ ఠాగూర్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పార్టీ నాయకులతో ఠాగూర్ మాట్లాడినట్టు సమాచారం. మరికొందరితో మాట్లాడేందుకు ఇంఛార్జ్ ఇబ్బంది పడుతున్నారట. అలాంటి వారితో AICC కార్యదర్శి బోసురాజు మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికైతే వ్యవహారం ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. పార్టీ నిర్ణయాన్ని సాకుగా చూపించి .. నాయకులు ఎవరూ జంప్ చేయకుండా చూడాలని అధిష్ఠానం భావిస్తోందట.
read also : కడియం శ్రీహరి ఇంట్లో సీఎం కేసీఆర్ విందు.. దేనికి సంకేతం?
బయటపడలేకపోతున్న కొందరు సీనియర్లు!
తన నిర్ణయానికి అధిష్ఠానంతో ఆమోదముద్ర వేయించుకునే పనిలో ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ఉన్నట్టు కాంగ్రెస్ సీనియర్లు నమ్ముతున్నారట. ఇదే అంశం మేడం దగ్గరకు కూడా వెళ్లినట్టు చెబుతున్నారు. ఈ అభిప్రాయంతో ఉన్న వాళ్లలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేతలు వి హన్మంతరావు, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారట. పార్టీ నిర్ణయాన్ని కాదనలేక బయట పడని సీనియర్లు సైతం ఉన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు.
పార్టీ మారబోమని జగ్గారెడ్డి, కోమటిరెడ్డి చెప్పారా?
పీసీసీ నియామకంపై అధిష్ఠానం తీసుకునే నిర్ణయం తమకు అనుకూలంగా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, కేఎల్‌ఆర్ లాంటి వాళ్లు పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం తమ చెవిన పడగానే వాటిని కోమటిరెడ్డి, జగ్గారెడ్డి ఖండించారు. పార్టీ మారను.. అలాగే ఏ పదవీ అడగను అని ఇంఛార్జ్ ఠాగూర్‌కు చెప్పారట కోమటిరెడ్డి. ఇక ఎమ్మెల్యే జగ్గారెడ్డి మొదటి నుంచి రేవంత్ పేరును వ్యతిరేకిస్తున్నారు. అయితే పీసీసీ ప్రకటన వెలువడిన తర్వాత ఆయన వెంటనే ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే పార్టీకి మాత్రం దూరంగా ఉంటారని తెలుస్తోంది. నియోజకవర్గం లక్ష్యంగా రాజకీయాలు మొదలుపెట్టాలని చూస్తున్నారట జగ్గారెడ్డి. ఇక మొదటి నుంచి ఫైర్ అవుతున్న హన్మంతరావు యాక్షన్ ప్లాన్ ఏంటన్నది చూడాలి. KLR లాంటి వాళ్లయితే పార్టీకి గుడ్‌బై చెప్పడానికి నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సీనియర్లు కొత్త సారథికి సహకరిస్తారా?
తెలంగాణ పీసీసీ నియామకం ఎపిసోడ్ కూడా జనానికి, పార్టీ వర్గాలకు వినీ వినీ బోర్ కొడుతోంది. కొత్త కమిటీని ప్రకటించాక సీనియర్లు నూతన సారథికి సహకరిస్తారా? సీనియర్లను కాదని కొత్త చీఫ్‌కు పనిచేయడం సాధ్యమేనా అని ప్రశ్నించేవారు లేకపోలేదు.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!