తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం వివిధ బ్యాంకుల ప్రతినిధులతో బ్యాంక్ అధికారులు, సిబ్బంది వ్యాక్సినేషన్ పై బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి…
మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లు) ఈనెల 7న ప్రారంభించాలని నిర్ణయించారు.. మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్.. జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్న…
నైరుతి ఋతుపవనాలు ఈ రోజు కర్ణాటక తీరం, గోవా అంతటా మరియు మహారాష్ట్రలో కొంత భాగం, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో చాలా భాగం, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో కొంత భాగం (నైరుతి జిల్లాలలోకి) తమిళనాడులో చాలా భాగంలోకి ప్రవేశించాయి. రాగల 24 గంటలలో తెలంగాణా రాష్ట్రంలో చాలా భాగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు నైరుతి దిశగా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నాయి. రాగల 3 రోజులు (05,06,07వ తేదీలు) తేలికపాటి…
బీజేపీలో చేరాలన్న ఈటెల నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యం అన్నారు సీపీఎం తమ్మినేని వీరభద్రం. తాను చేస్తున్న అప్రతిష్టాకరమైన పనిని కప్పిపెట్టుకోవడానికి కమ్యూనిస్టులపై కువిమర్శలు చేయడం అభ్యంతరకరం. వామపక్ష రాజకీయాలతో ప్రారంభమై లౌకిక ప్రజాస్వామికవాదిగా కొనసాగి ఇప్పుడు ఏకంగా మతోన్మాద ఫాసిస్టు బిజెపి పంచన చేరడం సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రజాకంటక పాలన సాగిస్తున్నది. లౌకిక విలువలను గంగలో కలిపి మతోన్మాద రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నది. తన రాజకీయ భవిష్యత్తు కోసం బిజెపి లాంటి ప్రమాదకర పార్టీని…
తెలంగాణ సీఎం కేసీఆర్‌ది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ కామెంట్ చేశారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. టీఆర్ఎస్ నుంచి వలసలపై స్పందించిన ఆయన.. ఆలే నరేంద్రను వెళ్లకొట్టారు, విజయ శాంతి, స్వామి గౌడ్ వంటి ఎంతో మందిని బయటకు పంపించారు.. ఇప్పుడు ఈటల వంతు వచ్చిందన్నారు.. మధుసూదనాచారిని కేసీఆరే ఓడగొట్టారంటూ విమర్శించిన ఆయన.. ఇక, మిగిలింది హరీష్ రావే!.. హరిష్ రావుకు కూడా అనేక అవమానాలు జరిగాయని చెప్పుకొచ్చారు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులు…
సిద్దిపేట జిల్లా… నంగునూర్ మండలం మగ్దుంపూర్ లో ఆయిల్ ఫామ్ సాగు ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ఈ సందర్బంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతుల జీవితాలు బాగు పడతాయని చెప్పిన మాట నిజమైంది. కాళేశ్వరం జలాలతో తెలంగాణలోని భూ ఉపరితల సాగునీటి పరిమితి పెరిగింది. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తలదన్నే విధంగా తెలంగాణలో ధాన్యం పండింది అన్నారు. ప్రతి ఏటా మన దేశంలో 90 వేల కోట్ల పామాయిల్ ను విదేశాల నుంచి…
హైదరాబాద్‌లో ఓ బాలుడు నాలాలో కొట్టుకుపోయి మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది.. దీంతో బోయిన్‌పల్లిలో విషాదం నెలకొంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ప్రమాదవశాత్తు చిన్నతోకట్ట నాలాలో పడిపోయాడే ఏడేళ్ల బాలుడు ఆనందసాయి.. నాలా నిర్మాణంలో ఉండగా.. ఇంటిముందు ఆడుకుంటుండగా అందులో పడిపోయాడు… విషయం తెలుకున్న స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినా.. ఆ బాలుడు ప్రాణాలు దక్కలేదు.. నాలాలో పడిపోయిన ఆ బాలుడు మృతదేహంగా…
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీపీఐ నేత చాడా వెంకట్‌రెడ్డి.. టీఆర్ఎస్కు రాజీనామా సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.. ఈటల పచ్చి అవకాశవాదని వ్యాఖ్యానించిన చాడా… మతోన్మాద పార్టీ (బీజేపీ)లో చేరుతూ సీబీఐ మీద నిందలు వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు… టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఎత్తివేస్తే మా పార్టీ కార్యాలయాన్నే ధర్నా చౌక్‌గా మార్చిన చరిత్ర సీపీఐది అన్న ఆయన.. అసైన్ భూములు…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ నెల 10వ తేదీన కామారెడ్డి, నిజమాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, పోలీస్ కార్యాలను ప్రారంభించనున్నారు.. ప్రారంభోత్సవానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని భవనాలను సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.. కామారెడ్డి పట్టణ శివారులోని నూతన కలెక్టరేట్, పోలీసు భవనాల నిర్మాణ పనులను 2017లో అప్పటి రెవెన్యూశాఖ మంత్రి మహ్మద్‌అలీ ప్రారంభించగా.. సుమారు 30 ఎకరాలలో రూ.66 కోట్ల నిధులతో…
వ్యాక్సినేషన్ విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేటలో హై రిస్క్ పర్సన్స్ కి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.. వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనేరీతిలో కేంద్రం వ్యవహారం ఉందన్న ఆయన.. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని.. మరోవైపు…