రైతులకు తెలంగాణ శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. జూన్ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పార్ట్-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. జూన్ 10ని కట్టాఫ్ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. రైతుబంధు నిధుల విషయంలో…
తెలంగాణ సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమీషన్లకు ఆశపడి ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వకుండా కెసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. “ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి KCR సారూ. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన..? తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా వ్యాక్సిన్లను పోందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల అధికారులు, సిబ్బందికి వ్యాక్సిన్లను అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారంలోగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా హై ఎక్స్ పోజర్ కేటగిరీలో ఉన్న 12…
జూన్ 9 వ తేదీన తెలంగాణలో లాక్డౌన్ ముగియబోతున్నది. మే 31 నుంచి పదిరోజులపాటు లాక్‌డౌన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో జూన్ 8 వ తేదీన తెలంగాణ కేబినెట్ మరోసారి భేటీ కాబోతున్నది. జూన్ 8 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. ఈ…
వ్యాక్సినేషన్ పంపిణి పై హరీశ్ రావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. వ్యాక్సిన్ పై కొందరు కేసీఆర్ కుటుంబ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో కూర్చిని గ్లోబల్ టెండర్లు వేస్తే ఎవరూ ముందుకు రారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉంది. విదేశాంగ మంత్రి వ్యాక్సిన్ ముడి సరుకు కోసం ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నారు. దేశంలోని హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఒక్కటే వ్యాక్సిన్…
టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. ఇక స్పీకర్ కు రాజీనామా లేఖ ఇచ్చేందుకు మంచిరోజు కోసం చూస్తున్నట్టు సమాచారం. అన్ని కుదిరితే సోమవారం ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా లేఖ ఇస్తారని తెలుస్తోంది. స్పీకర్ ను కలిసి ఇవ్వడమా? లేక ఫ్యాక్స్ లో పంపడమా? అనే అంశంపై ఈటల తన అనుచరులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. రాజీనామా లేఖ ఆమోదం తర్వాత ఈటల బీజేపీలో చేరనున్నారు. చేరిన తరువాత…
తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి వారంలో రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటామని గతంలో చెప్పిన సర్కార్.. లాక్ డౌన్ ముగియగానే ఇంటర్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ఇప్పుడు అంటోంది. ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి పరీక్షలు, ఫలితాలపై ఏ నిర్ణయం తీసుకున్నారో వివరాలు తెప్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జులై రెండో వారంలో పరీక్ష సమయం తగ్గించి పరీక్షలు నిర్వహిస్తామని…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం చేపట్టి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి రాజ్ భవన్ లోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ గారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని యువకుడు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి…
లాక్డౌన్ ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. లాక్డౌన్ వల్ల తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,38,182 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 2070 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. కరోనా బారినపడి మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 5,89,734 కరోనా కేసులు, 3364 మరణాలు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో.. 3,762…
టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పదేపదే తన పేరు ప్రస్తావించడంపై తీవ్రంగా స్పందించారు టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు.. పదేపదే ఈటల నా పేరు ప్రస్తావించడం ఆయన భావదారిద్ర్యానికి నిదర్శనమన్న హరీస్.. ఈటల వ్యాఖ్యలను ఖండించారు.. ఈటల టీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవ కంటే.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువని వ్యాఖ్యానించిన ఆయన.. రాజేందర్.. పార్టీని వీడినా టీఆర్ఎస్కు వచ్చిన నష్టం ఏమీలేదన్నారు.. నా కంఠంలో ఊపిరి ఉన్నంత…