తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు అవార్డు సొంతం చేసుకున్నాడు.. గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చడానికి ఇనిషియేటివ్ చేసినందుకుగానూ హిమాన్షును ‘డయానా’ అవార్డు వరించింది… ఈ సందర్భంగా తనకు గైడ్‌గా ఉన్న తన తాత సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు హిమాన్షు.. కాగా, ‘శోమ’ పేరుతో రూపొందించిన ఒక వీడియోలో.. హిమాన్షు.. తన ఉద్దేశాలను వివరించారు. దానిలో.. అతను ఆహార ఉత్పత్తులలో కల్తీ గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాడు.. అంతేకాదు.. కల్తీ లేని ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో గ్రామీణ ప్రజలను ఎలా శక్తివంతం చేయాలని సూచనలు చేశాడు.. దీంతో.. తనకు ఆ అవార్డు వచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు హిమాన్షు.
తనను గైడ్ చేసిన తన తాత తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు హిమాన్షు.. “గంగాపూర్ – యూసుఫ్‌ఖాన్‌పల్లి ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదాలు, నా గురువులు, మరియు ప్రాజెక్ట్‌కు నాకు మార్గనిర్దేశం చేసిన నా తాతకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.. ఇక, ఈ డయానా, ప్రిన్స్ ఆప్ వేల్స్ పేరు మీద ఉన్న డయానా అవార్డును.. ఎందుకు ఇస్తారనే విషయాన్ని కూడా పేర్కొన్నాడు.. ఇతరుల జీవితాలను మెరుగుపర్చడానికి కృషి చేసే యువకులకు ఈ అవార్డు ఇచ్చి సత్కరిస్తారు.. అది కూడా 9 నుండి 25 సంవత్సరాల వయస్సు మధ్య గల యువకులు సామాజిక, మానవతా దృక్పథంతో చేసే పనులకు అందిస్తారు.. అయితే, మన హిమాన్షు రావు.. ‘శోమ’ పేరుతో రూపొందిచిన ఈ ప్రాజెక్ట్ వీడియోలో 12 ప్రతిష్టాత్మక లక్ష్యాలను పంచుకున్నాడు. గ్రామస్తులు ఒక చిన్న పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా పేదరికం లేని స్థితికి చేరుకోవడం, స్వయం ఉపాధి కల్పించడం ద్వారా అందరికీ ఆకలిని దూరం చేయడం.. మంచి ఆరోగ్యం, కల్తీలేని ఆహారం వినియోగాన్ని ప్రోత్సహించడం, సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా పునరుత్పాదక శక్తితో పాటు ఉద్యోగ కల్పన మరియు ఆర్థిక వృద్ధి పెరుగుతోందని వివరించారు.. ఇక, ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని.. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ట్వీట్ చేశారు హిమాన్షు. కాగా, డీహెచ్‌ఎఫ్‌ఎల్, ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిర్వహించిన ‘బెహతర్ ఇండియా క్యాంపెయిన్, పర్యావరణ విభాగం’లో హిమాన్షు ఇప్పటికే బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల వ్యర్థాలను సేకరించి అగ్రస్థానంలో నిలిచిన హిమాన్షు పతకాన్ని అందుకున్నాడు.
With great delight I announce that I have received my Diana Award for my tremendous Initiative SHOMA-Making Villages Self-Sustainable! More details will be announced soon! pic.twitter.com/l6FgUSKQfp
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) June 28, 2021