ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలోని భూములను వేలం వేసింది. ఈ వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కోకాపేటలో వేలం వేసిన భూములను సందర్శించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కోకాపేట భూములను సందర్శించి, ధర్నా చేయాలని పార్టీ నిర్ణయించారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భూముల సందర్శనకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read: జపాన్ లో దుమ్మురేపుతున్న తలైవా మూవీ !
తెల్లవారుజామున మూడు గంటల నుంచే టీపీసీసీ అధ్యక్షుడు ఇంటి వద్ద పోలీసులు మకాం వేశారు. బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. ఇకపోతే, భూముల సందర్శనలకు పీసీసీ ఎన్నికల నిర్వాహన కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేష్‌కుమార్ గౌడ్ తదితరులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీరిని కూడా పోలీసులు అడ్డుకునే అవకాశం ఉన్నది. ఇటీవలే పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇప్పుడు కోకాపేట భూముల సందర్శనకు పిలుపునిచ్చి పార్టీ దూకుడును పెంచింది.