తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షునిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి నియామకం పట్ల ములుగు ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా కలిసి పనిచేస్తారని సీతక్క ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు సీతక్క మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఊరేగింపుగా వెళ్లిన సీతక్క వన దేవతలను దర్శించుకొని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షునితో పాటు అయిదుగురు కార్యనిర్వాహక…
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు అవార్డు సొంతం చేసుకున్నాడు.. గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చడానికి ఇనిషియేటివ్ చేసినందుకుగానూ హిమాన్షును ‘డయానా’ అవార్డు వరించింది… ఈ సందర్భంగా తనకు గైడ్గా ఉన్న తన తాత సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు హిమాన్షు.. కాగా, ‘శోమ’ పేరుతో రూపొందించిన ఒక వీడియోలో.. హిమాన్షు.. తన ఉద్దేశాలను వివరించారు. దానిలో.. అతను ఆహార ఉత్పత్తులలో కల్తీ గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాడు.. అంతేకాదు.. కల్తీ…
తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి, వారి జీవితాల్లో గుణాత్మకమార్పును రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నదని, తమ లక్ష్యసాధనలో దళిత మేధావి వర్గం కదలిరావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. 1200 కోట్ల రూపాయలతో ప్రారంభించి, రానున్న కాలంలో 40 వేల కోట్లతో అమలు చేయబోతున్న ‘సిఎం దళిత సాధికారత పథకం’ కోసం పటిష్టమైన కార్యాచరణ ను రూపొందిస్తున్నామని, అందుకు తగు సూచనలు సలహాలు అందించాలని, తనను కలిసి ధన్యవాదాలు తెలిపిన…
వ్యాక్సిన్ నేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.. ప్రాధాన్యత ప్రకారం వ్యాక్సినేషన్ చేస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇస్తుండగా.. ఇప్పుడు విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లేవారికి వ్యాక్సిన్పై గైడ్లైన్స్ విడుదల చేశారు.. ఉద్యోగ అవసరాలపై విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది ఆరోగ్య శాఖ.. విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లేవారు పాస్ పోర్ట్, వర్క్ పర్మిట్ వీసాలను చూపించి ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా పొందవచ్చని…
గతంతో పోలిస్తే… తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,21, 606 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 13,869 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 9 మంది మృతి చెందారు. read also…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదం మళ్లీ రాజుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది. ఈ నీటి వివాదంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ… తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ”వైఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగ అయితే… సీఎం జగన్ గజ దొంగ” అన్న సందర్భాలు ఉన్నాయి. అటు ఏపీ మంత్రులు కూడా అదే స్థాయిలో తెలంగాణ ప్రభుత్వపై…
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇకపై రాజకీయపరమైన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించారు.. కేవలం ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని ప్రకటించిన ఆయన.. తనను రాజకీయాల్లోకి లాగవద్దు అని విజ్ఞప్తి చేశారు.. ఇక నుంచి భువనగిరి, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడ తిష్ట వేసిన సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తానని వెల్లడించారు కోమటిరెడ్డి… గ్రామాల అభివృద్దికి…
తెలంగాణలో ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది… మొదటగా జులై 1వ తేదీ నుంచి ఆఫ్ లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పటికే ప్రభుత్వ టీచర్లు ఈనెల 25వ తేదీ నుంచి స్కూళ్లకు వెళ్తున్నారు.. అయితే.. ఇవాళ మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఆఫ్ లైన్ తరగతులు స్టార్ట్ చేయాలని అనుకున్న…. కరోన నేపథ్యంలో ఆన్లైన్ తరగతులే నిర్వహించాలని సీఎం కేసీఆర్ చెప్పారని.. కేజీ నుండి పీజీ…
హైదరాబాద్ నడిబొడ్డులోని బేగంపేట్లో ఓ ఆడిటర్ కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. అయితే, ఆడిటర్ సాంబశివరావు కిడ్నాప్ కేసులు కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. ఆస్తితగాదాల నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ డ్రామా ఆడారని తెలుస్తోంది.. కిడ్నాపర్లతో కలిసి బాధితుడి మేనబావే ఈ స్కెచ్ వేశారని చెబుతున్నారు పోలీసులు.. ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసిన సాంబశివరావు.. అప్పులోళ్లు వేధింపులు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయారట.. ఇక, మీ భర్తను ఎవరో కిడ్నాప్ చేశారంటూ భార్యకు సమాచారం ఇవ్వడంతో.. ఆందోళనకు గురైన…
కరోనా మహమ్మారి అడవుల్లో అన్నలను కూడా తాకింది.. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు కరోనా బారినపడ్డారు.. వారు జనజీవన స్రవంతిలో కలిసిపోతే వారికి సరైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు.. అయితే, పోలీసుల ప్రకటను తీవ్రంగా ఖండిస్తున్నారు మావోయిస్టులు.. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖ విడుదల చేశారు.. కామ్రేడ్ శారద, ఇడ్మా ఆరోగ్యంగానే ఉన్నారని. పాలకులు, ప్రభుత్వాలు కావాలనే దుష్పాచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.. వాటిని నమ్మి కుటుంబ…