కృష్ణా జలాల వివాదంపై టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే రాజకీయ కోణంలో అనుమానించాల్సిన వస్తోందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొట్టుకునే దిశగా ఇరు రాష్ట్రాల మంత్రుల తీరు ఉందన్నారు. ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాటలు చూస్తుంటే రాజకీయ రగడ పుట్టేటట్లు ఉన్నాయన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి భోజనాలు చేసే పరిస్థితి దాటి.. తిట్టుకునే పరిస్థితి చూస్తుంటే కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపినట్లు కనిపిస్తోందని జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.…
తెలంగాణలో కరోనా పాజిటివ్ రోజువారి కేసుల సంఖ్య ఎనిమిది వందలకు చేరువైంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,03,398 సాంపిల్స్ పరీక్షించగా.. 808 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఏడుగురు కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 1,061 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,27,498కు చేరగా.. రికవరీ కేసులు 6,12,096గా…
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త శకం ప్రారంభం కానుంది.. మరో మూడు రోజుల్లో పార్టీని ప్రకటించనున్నారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల… ఇప్పటికే పొలిటికల్ పార్టీ పెట్టడం ఖాయమని స్పష్టం చేసిన ఆమె.. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నారు.. షర్మిల ఏర్పాటు చేయనున్న పార్టీ పేరు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా రిజిస్ట్రర్ చేయించారు.. ఇక, తాజాగా పార్టీ జెండా కూడా రెడీ అయిపోయింది.. జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట…
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరుకుంది.. రాళ్లతో కొట్టడం, ఉరికించి కొట్టడం, చెప్పుల దండలు.. ఇలా ఇప్పుడు లోపల(జైలు)కి పోతావ్ అంటూ వార్నింగ్ ఇచ్చేవరకు వచ్చింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. టి.పీసీసీ చీఫ్ రేవంత్‌పై విరుచుకుపడ్డారు.. ఈ నెల 7వ తేదీ తర్వాత ఎవరు ఏం చేస్తారో తెలుస్తుందన్న…
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్ వివాదాస్పద భూముల కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. హఫీజ్‌పేట్ భూములపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. భూములను యథాతథ స్థితిలో కొనసాగించాలని ఆదేశించింది.. కాగా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లింది తెలంగాణ ప్రభుత్వం.. వారం రోజుల క్రితమే మరో స్పెషల్ లీవ్ పిటిషన్‌ని అనుమతిస్తూ సర్వే నెంబర్ 80లో సి కళ్యాణ్‌తో పాటు మరికొందరికి టైటిల్ లేదని.. లేని టైటిల్ భూమిలో ఎలా…
తెలంగాణ సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.. సీఎం కేసీఆర్ దోపిడీని బయటపెడతామని.. అయన శేషజీవితాన్ని జైల్లో గడపాల్సిందేనని వ్యాఖ్యానించారు.. ప్రజలు ఎదురు తిరిగే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించిన ఆయన.. శిశుపాలుడి పాపాల కంటే కేసీఆర్ పాపాలే ఎక్కువయ్యాయని కామెంట్ చేశారు.. తప్పుడు సమాచారం ఇచ్చే సన్నాసిని మాత్రం నేను కానని.. మీరే కాదు.. మీ ఇంజనీర్లు కూడా 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు చూపించాలని…
రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ నిన్న పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు అండగా ఉండాలని చెప్పిన సీఎం కేసీఆర్… రైతు బీమా తరహాలోనే చేనేత బీమా పథకం తీసువస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు రూ. 5 లక్షల బీమా వర్తింప జేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. read also : ఏపీ మంత్రులపై జేసీ సంచలన వ్యాఖ్యలు.. అయితే.. చేనేత…
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని జేఎన్టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు ముట్టడించారు. ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి లేదా ఆన్లైన్ విధానం ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించాలంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు విద్యార్థులు. ఇందులో భాగంగానే సత్యసాయి నిగమాగమం నుండి మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటి వరకు ర్యాలీగా బయలుదేరారు విద్యార్థులు. read also : సినిమాలో కోడి కథ లాగే కేసీఆర్…
సీఎం కేసీఆర్ పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు తెలంగాణ జిల్లాలకు బొక్కలు… సిద్దిపేట్, సిరిసిల్లలకు మాత్రం ముక్కలు అన్న తీరుగా నడుస్తున్నాయని మండిపడ్డారు. పల్లెలన్నిటికీ మొక్కలు పెంచే పని ఇచ్చి, కుటుంబ సభ్యుల నియోజకవర్గాల్లో మాత్రం నిధుల చెక్కులు పంచే కార్యక్రమం పెట్టుకున్నారని చురకలు అంటిం చారు. ఇంతకు ముందు హుజూర్నగర్, నాగార్జున సాగర్‌లలో చేసిన వాగ్దానాలు ఏవీ అమలు చేయలేదని ఫైర్ అయిన విజయశాంతి…తాను గతంలో చెప్పిన…