తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వేగంగా వ్యాక్సిన్‌ను అందిస్తుండటంతో కేసులు తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 605 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 6,26,690 కేసులు నమోదయ్యాయి. ఇందులో 6,11,035 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,964 కేసులు యాక్టీవ్‌గా…
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్నది. వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకొని టీఆర్ఎస్ను ఢీకొట్టాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే త్వరలో బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి హుజూరాబాద్ వరకూ తొలివిడత పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆగస్టు 9 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ కీలక…
వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని..గొర్రెల పంపిణీ కి ఇప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ లు బతికి ఉన్నప్పుడే తెలంగాణ రాకముందు మిషన్ భగీరథ పథకం పై చర్చించామని తెలిపారు. read…
తెలంగాణ కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీనే లక్ష్యంగా విమర్శల పదును పెంచారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం లేని నీళ్ల వివాదాన్ని మరోసారి సృష్టించి.. రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నీళ్ల నుండి నిప్పులు రాజేసి రావణ కాష్టంగా మార్చి కాచుకొగలడు. నీళ్లతో ఓట్లు కొల్లగొట్టడం కేసీఆర్ కి అలవాటు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా…
రాజకీయాల్లో పాదయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. గతంలో నాయకులు అధికారంలోకి వచ్చేముందు పాదయాత్రలు చేసిన సందర్బాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు నేతలు అధికారంలోకి వచ్చేముందు పాదయాత్రలు చేశారు. ఆ పాదయాత్రల కారణంగా వారు అధికారంలోకి వచ్చారు. 2019లో జరిగిన ఎన్నికలు ముందు ఓ యువనేత పాదయాత్ర చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో పాలన చేతులు మారింది. కాగా, ఇలాంటి పాదయాత్ర ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రారంభం కాబోతున్నది. Read: వివాహం మూర్ఖత్వం, విడాకులు జ్ఞానం.. ఆమిర్…
తెలుగు నేలపై పాదయాత్రలు కొత్త కాదు.. పాదయాత్రలు నిర్వహించి సీఎంలు అయినవారు ఉన్న నేల ఇది.. అయితే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఆగస్టు 9వ తేదీ నుంచి మహాపాద యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారాయన.. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పాదయాత్ర నిర్వహిస్తాన్న ఆయన.. భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి పాదయాత్రను ప్రారంభించి హుజురాబాద్ వరకు నడవనున్నట్టు…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలు ఈనాటిది కాదు.. అయితే, తాజాగా ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య ఈ వ్యవహారంలో డైలాగ్ వార్ నడుస్తోంది… దీనిపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇద్దరు సీఎంలపై మండిపడ్డారు.. కృష్ణా జలాల వివాదాలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఇరు రాష్ట్రాల మధ్య జల జగడాలను తీర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవస్థలనే ప్రశ్నించే స్థాయికి పోయారని.. వ్యవస్థలను…
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కొత్త పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం.. దానికి కౌంటర్‌గా ఆ ఎమ్మెల్యేలు ఎదురు దాడిగి దిగడం జరిగిపోయాయి.. మీరు రాళ్లు విసిరితే.. మేం చెప్పులతో కొడతామంటూ హాట్ కామెంట్లు చేశారు పార్టీ వీడిన ఎమ్మెల్యేలు.. అయితే, ఆ వ్యాఖ్యలపై మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఒక్కడు కూడా మంత్రి వర్గంలో లేరన్న ఆయన.. తెలంగాణ ద్రోహులు రాష్ట్రాన్ని ఏలుతున్నారని విమర్శించారు.. ఎర్రబెల్లి,…
హైదరాబాద్ నడిబొడ్డున… అదీ జూబ్లీహిల్స్.. ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో దర్జాగా భూ దందా..! ఒకటి కాదు రెండు కాదు… అక్షరాలా 15 వందల కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూసింది.. గిమ్మిక్కులతో జిమ్మిక్కులు చేసి… లొసుగుల్ని అనుకూలంగా మలుచుకుని ఫిల్మ్‌నగర్‌లోని పదెకరాలు కారుచౌకగా కొట్టేయడమే కాకుండా… మరో నాలుగున్నర ఎకరాలకు ఎసరుపెట్టింది ఎవరు? రెడ్‌ఫోర్ట్ అక్బర్ సంస్థ వెనక ఉన్నదెవరు అంటే ఇద్దరు బడా నేతలన్నది జగమెరిగిన సత్యం. వారిద్దరూ కలిసి ఈ ప్రైమ్ ల్యాండ్‌లో చక్రం తిప్పారు.…