తెలంగాణ భారతీయ జనతా పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది… మాజీ మంత్రి, సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి.. బీజేపీకి రాజీనామా చేశారు.. బీజేపీలో ఈటల రాజేందర్ చేరికను ఆది నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన.. ఈటల.. పార్టీలో చేరితే ప్రకంపనలు తప్పవని హెచ్చరించారు. అయినా, బీజేపీ.. ఈటలకు ఆహ్వానం పలకడంపై అసంతృప్తిఉన్న ఆయన.. ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు.. బీజేపీ నుంచి హుజురాబాద్ స్థానాన్ని ఆశించారు పెద్దిరెడ్డి.. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్.. టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీ గూటికి చేరడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. హుజురాబాద్‌లో ఓవైపు ఈటల సమావేశాలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నా.. వాటికి దూరంగా ఉంటూ వచ్చారు. మొత్తంగా తాను పార్టీలో నెలగడం కష్టమని భావించి చివరకు రాజీనామా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. కాగా, తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమేనని చెప్పుకుంటున్న కమలం పార్టీకి.. వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. ఈ మధ్యే మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి గుడ్ బ్ చెప్పగా.. ఇప్పుడు పెద్దిరెడ్డి ఆ జాబితాలో చేరారు.