తెలంగాణ భారతీయ జనతా పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది… మాజీ మంత్రి, సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి.. బీజేపీకి రాజీనామా చేశారు.. బీజేపీలో ఈటల రాజేందర్ చేరికను ఆది నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన.. ఈటల.. పార్టీలో చేరితే ప్రకంపనలు తప్పవని హెచ్చరించారు. అయినా, బీజేపీ.. ఈటలకు ఆహ్వానం పలకడంపై అసంతృప్తిఉన్న ఆయన.. ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు.. బీజేపీ నుంచి హుజురాబాద్ స్థానాన్ని ఆశించారు పెద్దిరెడ్డి.. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల…
కరోనా మహమ్మారి దెబ్బకు స్కూళ్లతో పాటు విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత.. అక్కడక్కడ మళ్లీ తెరిచే ప్రయత్నాలు చేసినా.. మళ్లీ కోవిడ్ పంజా విసరడంతో.. అంతా వెనక్కి తగ్గారు.. ఇక, కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ స్కూళ్లు తెరిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి… చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఉంటుందని.. టీచర్లు, స్కూల్ సిబ్బందికి వ్యాక్సిన్ వేసి.. మళ్లీ భౌతిక తరగతులు ప్రారంభించుకోవచ్చు అనే…
‘నాడు నేడు’ సాఫ్ట్ వేర్‌ను తెలంగాణ రాష్ట్రం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్… మన బడి, నాడు నేడు సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణలోని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించేకునేందుకు అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్.. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు నేడు సాఫ్ట్‌వేర్‌ను వినియోగించింది ఏపీ ప్రభుత్వం.. ఇక, టీసీఎస్ రూపకల్పన చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణకు ఇచ్చేందుకు నిరభ్యంతర…
పదవీ విరమణ వయస్సు 61 యేండ్లకు పెంపు పై సింగరేణి భవన్ లో సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో పదవి విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతూ ఈ సందర్భంగా బోర్డు నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్ణయం ప్రకారం… పెంచిన వయస్సు మార్చి 31, 2021 నుండి అమల్లోకి రానుంది. అలాగే మార్చి 31 జూన్ 30వ తేదీ మధ్య కాలంలో రిటైర్మెంట్ తీసుకున్న 39…
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి… 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య.. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ.. పార్లమెంట్ ముట్టడికి వెళ్తున్న బీసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆర్. కృష్ణయ్య.. బీసీల పట్ల కేంద్ర వైఖరిని ఖండిస్తున్నాం.. బీసీ బిల్లు ప్రవేశ పెట్టకపోతే లక్ష మందితో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు..…
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్, ఉప్పునుంతలలో భూమి స్వల్పంగా కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. ఈ ఉదయం 5 గంటలకు భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే, భూప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. భారీ వర్షాలు, వరదల కారణంగా భూమి పోరల్లోకి నీరు చేరడం వలన భూప్రకంపనలు వచ్చి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. …
హుజురాబాద్ సిటీ సెంటర్ హల్ లో కేబుల్ ఆపరేటర్స్ – హమాలి సంఘ సభ్యులతో తెలంగాణ మంత్రి గంగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆపదలో, ఆకలితో ఉన్నవారిని ఆధుకునే మంచిమనుసు సీఎం కేసీఆర్ ది అని.. కేబుల్ ఆపరేటర్లు, హమాలీలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. అర్హులైన కేబుల్ ఆపరేటర్లకు, హమాలీలకు అతి త్వరలో డబుల్ బెడ్రూం, బీమాసౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఈటెల ఏనాడు హుజురాబాద్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ను అడగలేదని……
తెలంగాణలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి..తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 494 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… మరో నలుగురు మృతి చెందారు.. ఇదే సమయంలో 710 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,41,153 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,27,964 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,784కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ…
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ పీసీసీ ఛీప్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘దళిత బంధు పేరిట దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ పథకాన్ని రచించాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు. దళితులకు 3 ఎకరాల…
టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి రేవంత్ నిప్పులు చెరిగారు. చివరి దాకా కాంగ్రెస్ జెండా మోసిన వాళ్లే తన బంధువు అని..కష్టపడ్డ వాడే తనకు బంధువు అని పేర్కొన్నారు. మరో 20 నెలలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి పని చేయాలని కోరారు. అధికారం లోకి వచ్చిన తర్వాత కష్టపడి పని చేసిన కార్యకర్తల కే పదవులు అని పేర్కొన్నారు. read also : కర్నూలు జిల్లా వైసీపీలో వారసుల హవా! ఉప ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ పథకాలు…