హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో అచ్చపేట మండలం చెన్నారం గేట్ దగ్గర శ్రీశైలం హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఇక, ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. ప్రమాదం గురించి తెలిసిన…
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,530 శాంపిల్స్ పరీక్షించగా.. 643 మందికి పాజిటివ్గా తేలింది.. మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందగా.. తాజాగా 767 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,40,012కు చేరుకోగా.. ఇప్పటి వరకు కరోనాతో 3,778 మంది మృతిచెందారు.. 6,26,505 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. రాష్ట్రంలో రికవరీ…
కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిపోయి.. సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. మరోవైపు థర్డ్ వేవ్ కూడా ప్రారంభదశలో ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరికలు జారీ చేసింది.. ఈ సమయంలో.. సీరం సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.. తెలంగాణలో ఇటీవల నాలుగో దఫా సీరం సర్వేని నిర్వహించింది ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ … ఆ సర్వేలో 60 శాతం మందిలో కోవిడ్ యాంటీ బాడీలను గుర్తించినట్టు ప్రకటించింది.…
రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుత అవకాశాలున్నాయని.. ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు కంపెనీలు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదారాబాద్ తాజ్కృష్ణలో టాటా బోయింగ్ డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీ విజయోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. టాటా బోయింగ్ హైదారాబాద్ ఫెసిలిటీలో తయారైన 100 AH-64 అపాచి ఫ్యూస్ లైజ్ డెలివరీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తక్కువ సమయంలోనే ఈ మైల్ స్టోన్ అందుకున్న కంపెనీని…
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వ్యవహారం ఏపీ, తెలంగాణ మధ్య కాకరేపాయి.. పరస్పరం ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు.. ఇలా చాలా వరకే వెళ్లింది వ్యవహారం.. అయితే, విషయంలో కృష్ణా నది యాజమాన్యబోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), చెన్నై బెంచ్.. సొంతంగా తనిఖీలు జరిపి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తనిఖీలకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదన్న కృష్ణా బోర్డు నివేదనను పరిగణలోకి…
నిన్న ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఈ రోజు ఒడిస్సా,పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతములో కొనసాగుతుంది. ఈ అల్పపీడనంకి అనుభందంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కిమీ ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక ప్రదేశములలో రేపు చాలా ప్రదేశములలో మరియు ఎల్లుండి కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి. వాతావరణ హెచ్చరికలు : ఈ…
బీజేపీలో చేరిన ఈటలపై మోత్కుపల్లి నర్సింహులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల అవినీతి నాయకుడని, అవినీతి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారని అలాంటి అవినీతి నాయకుడిని బీజేపీలో చేర్చుకుంటారని మోత్కుపల్లి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన దళితబంధు కార్యక్రమానికి మోత్కుపల్లి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం తరువాత ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. అంతేకాదు, మోత్కుపల్లి బీజేపీకి కూడా రాజీనామా చేశారు. తనలాంటి వారు బీజేపీలో ఇమడలేరని, ఎమ్మెల్యేగా 30 ఏళ్ల అనుభవం…
మనుగడ కష్టమైనచోట దుకాణం మూసేయడం కామన్. తెలుగు రాష్ట్రాల్లో చాలా పార్టీలు ఇదే చేశాయి. కానీ.. ఆయన ఆలోచన వేరేలా ఉంది. ప్రజల్లో ఆదరణ తగ్గినా పార్టీని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారో లేక.. ఒక మనిషి ఆఫీస్లో ఉంటే చాలని భావించారో ఏమో తాళం తీసి.. తాళం వేసే వారికి బాధ్యతలు అప్పగించారని టాక్ నడుస్తోంది. ఆ పార్టీ ఏంటో? ఎవరో.. ఈ స్టోరీలో చూద్దాం. బక్కని ఎంపికపై టీడీపీలో చర్చ లేదు.. ఆశ్చర్యం లేదు! తెలంగాణలో…
ఎడతెరపి లేని వర్షాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరిఖని శివారు గోదావరి నది వంతెన వద్ద వరద నీటిలో సమ్మక్క సారలమ్మ గద్దెలు మునిగిపోయాయి. గోదావరి ఓడ్డున ఉన్న బోట్ వరద ప్రభావంతో రాజీవ్ రహదారి వద్దకు కొట్టుకువచ్చింది. నది సమీపంలోని ఇటుక బట్టీలలో పనిచేసే 20 కుటుంబాలు వరదరలో చిక్కుకోవడంతో మర బోట్ ల ద్వారా వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు. వరద నీటిలో గోదావరిఖని లారీ…