పార్టీలో ఉండేవారు ఎవరో.. వెళ్లిపోయేవారు ఎవరో తెలియడం లేదు. ఎందుకైనా మంచిదని ఆరా తీస్తుంటే లేనిపోని సమస్యలు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఈ సంకట స్థితినే ఎదుర్కొంటోంది. వేరేపార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి తాజా పరిణామాలు ఇబ్బందిగా మారాయట. పార్టీకి ఎవరో ఒకరు గుడ్‌బై చెప్పి ప్రతిసారీ పాతివ్రత్యం నిరూపించుకోవాలా అని ప్రశ్నిస్తున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న కమలనాథులు! తెలంగాణ బీజేపీలో గత రెండు మూడేళ్లుగా చేరికలు…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. అలాగే పైన జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 3,78,311 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 31,784 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 860.30 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 106.9352 టీఎంసీలు ఉంది.…
తెలంగాణ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,213 శాంపిల్స్ పరీక్షించగా.. 647 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందగా.. తాజాగా 749 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,40,659 కు చేరుకోగా.. ఇప్పటి వరకు కరోనాతో 3780 మంది మృతిచెందారు.. 6,27,254 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు..…
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ కేసులో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష పడింది.. దీంతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు.. కాగా, మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. దానిపై విచారణ జరిపిన హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో… ఎంపీ కవిత 10 వేల రూపాయలు జరిమానా చెల్లించారు.. అలాగే…
హుజురాబాద్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు గులాబీ పార్టీ అధినేత, సీఎం కె. చంద్రశేఖర్ రావు.. దళిత బంధు పథకాన్ని పైలట్‌గా ఆ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే కాదు.. ప్రతిపక్షాల విమర్శలకు సైతం తన దైన శైలిలో.. పథకాల ద్వారా లబ్ధిపొందాలని చూడమా? మాది రాజకీయా పార్టీ కాదా? అంటూ కౌంటర్ ఇచ్చారు కేసీఆర్.. ఇక. తాజాగా.. ఆ ప్రాంత ఎంపీటీసీకి ఫోన్ చేసి.. కేసీఆర్ నెరిపిన సంభాషణ ఇప్పుడు…
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు… క్రమంగా విమర్శల వాడి పెంచుతున్నారు.. ఇప్పటికే ఇందిరా పార్క్, లోటప్పాండ్ లో దీక్షలు చేసిన షర్మిల.. తాజాగా ఖమ్మం వేదికగా నిరుద్యోగ దీక్ష చేశారు.. ఇక, ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా పాటించాలని వైఎస్ఆర్టీపీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.. నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష కార్యక్రమంలో భాగంగా రాబోయే మంగళవారం (27వ తేదీ) ఉమ్మడి నల్గొండ…
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది… తమ గ్రామానికి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు రోడ్డు వేయలేదంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు గ్రామస్తులు.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఎదురైన చేదు అనుభవానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని రత్నతండా గ్రామస్తులు అడ్డుకున్నారు.. దీంతో.. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. నర్మెట్ట మండలం మచ్చుపహడ్ రిజర్వు ఫారెస్ట్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో 10 వేల మొక్కలు నాటే…
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు వ్యవహారం ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది.. అయితే, ఇవాళ బయ్యారం ఉక్కుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్… మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.. ఫ్యాక్టరీ ఏర్పాటు అయితే వేలాదిమందికి ఉపాధి దొరుకుతుందన్న ఆమె… ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.. ఇక, కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ ఏర్పాటు…
తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధానమంత్రి కావాలి.. అప్పుడే తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధి దేశం మొత్తం జరుగుతుందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలు పెద్దగా కనిపించలేదు… అందుకే కరువు కాటకాలు ఎదుర్కుంటున్నారని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ భవిష్యత్ దృష్టితో హరితహారం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని.. కేసీఆర్ ప్రధాన మంత్రి అయితే దేశం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. ఇక,…
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరింది గోదావరి నీటిమట్టం.. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. గోదావరి పరివాహక ప్రాంతాలను అలర్ట్ చేశారు.. ఇక, అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.. ఇటు, దేవీపట్నం మండలంలోని 33 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. ఎగువ కాపర్ డ్యామ్‌పై గోదావరి ఉగ్రరూపం…