ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు ప్రమాదం తప్పింది.. ఆయన ప్రయాణిస్తున్న కారు టేకులపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడడంతో ప్రమాదం జరగగా.. ఈ ఘటనలో ఆయనకు స్వల్పగాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని నర్సయ్యను చికిత్స కోసం ఇల్లందు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స నిర్వహించారు.. ఈ ప్రమాదంలో కారు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది.. కొత్తగూడెం నుంచి ఇల్లందు వైపు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైనట్టుగా చెబుతున్నారు.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ.. మాజీ అయిన తర్వాత కూడా సైకిల్‌పై సాధారణంగా తిరిగే వ్యక్తి గుమ్మడి నర్సయ్య.. ఇక తన పొలంలోనూ ఆయనే స్వయంగా వ్యవసాయం చేస్తుంటారాయన. ప్రజా సమస్యలపై నిత్యం స్పందిస్తూ జనం మనిషిగా పేరుతెచ్చుకున్నారు.