ఓవైపు కొత్తగా పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ.. ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతుంటూ.. మరోవైపు.. మా పార్టీ ఇంతే.. ఎవరో అవసరం లేదు.. మేం మేమే తన్నుకుంటూం.. మేం మేమే చూసుకుంటాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.. ఇవాళ గాంధీ భవన్లో పాస్ ల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్లాటకు దిగారు.. తాము చాలా సీనియర్ నేతలం మాకు పాస్ లు ఇవ్వకుండా కొత్తగా…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది.. ఇప్పుడు అందరి నోట దళితుల మాటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత కోసం ఓ ఉద్యమాన్నే బుజాలకు ఎత్తుకున్నారు.. దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.. దీనిని కేవలం ఒక ప్రాంతానికి ఏ ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేయకుండా.. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు.. దళితులకు మరింత ప్రాధాన్యత ఇస్తామని. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ దళితులకు రిజర్వేషన్ కల్పిస్తామని.. అన్ని అంశాల్లోనూ వారికి లబ్ది కలిగేలా చర్యలు తీసుకుంటామంటూ.. హుజూరాబాద్ వేదికగా జరిగిన…
మేం ట్రెండును ఫాలో అవ్వం.. సెట్ చేస్తాం.. అంటూ ఓ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్ చెబుతారు.. ఇది సరిగ్గా సరిపోయే వ్యక్తం ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ సీఎం, గులాబీ దళపతి కె.చంద్రశేఖర్ రావే.. తెలంగాణ రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా అయనే ట్రెండ్ సెట్టర్. అయన ఏం చేసినా వినూత్నమే… మెదట అసాధ్యం అనిపించేలా అయన పథకాలుంటాయి.. తర్వాత అందరు ఫాలో అయ్యేలా రిజల్ట్ ఉంటుంది. పరిపాలనలో అయినా రాజకీయాల్లో అయినా……
సోషల్ మీడియాను తెలంగాణ జానపద పాటలు షేక్ చేస్తున్నాయి.. ఈ మధ్య ఎక్కడకి వెళ్లినా బుల్లెట్ బండి పాట వినిపిస్తోంది.. ప్యాసింజర్ ఆటోల నుంచి టీస్టాల్, దాబా ఇలా ఎక్కడైనా ఆ పాటనే హల్ చల్ చేస్తోంది.. అయితే, తాజాగా ఓ వధువు తన పెళ్లి తర్వాత జరిగిన బరాత్‌లో ఆ పాటకు లయ బద్దంగా కాలు కదుపుతూ చూపరులను ఆకట్టుకుంది.. వధువు స్టెప్పులకు.. ఫిదా అయిన భర్త అలా చూస్తుండి పోయాడు.. అయితే వధువు ఏదో…
శ్రీశైల మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పారు అధికారులు.. ఇవాళ్టి నుంచి భక్తులకు సర్వ దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. అయితేచ, కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా గర్భాలయ అభిషేకాలను ఏడు విడుతలుగా, సామూహిక అభిషేకాలు నాలుగు విడుతలుగా కల్పించాలని నిర్ణయించారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు మూడు విడుతలుగా కల్పించనున్నారు. అభిషేకంతో పాటు దేవాలయంలో జరిగే సేవల టికెట్లన్నీ ఆన్లైన్, కరెంటు బుకింగ్ ద్వారా…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృ వియోగం కలిగింది.. తమిళిసై తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. ఆమె వయస్సు 80 ఏళ్లుగా చెబుతున్నారు.. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు కృష్ణకుమారి.. కాసేపట్లో ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్ భార్య.. ఆ దంపతుల పెద్ద కుమార్తె గవర్నర్ తమిళిసై. కృష్ణకుమారి…
ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన తొలి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో విజయవంతం కావడంతో.. అదే ఊపుతో మరో సభకు సిద్ధమైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ… ఇంద్రవెల్లి బహిరంగసభ వేదికగానే.. ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నంలో తర్వాతి సభ ఉంటుందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు.. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించడం.. ఇతర కారణాలతో ఆ వేదిక కాస్తా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మహేశ్వరం నియోజకవర్గానికి షిఫ్ట్ అయిపోయింది.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని…
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం, చిరుజల్లులు పడుతుండగా.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు తప్పేలా లేవని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య బంగాళాఖాతం నుంచి నైరుతి దిశవైపునకు వంపు తిరిగి ఉన్నదని, వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయవ్యదిశగా కదలొచ్చని అంచనా వేస్తోంది హైదరాబాద్…
అన్నదాతలకు గుడ్‌న్యూస్ చెబుతూ.. రుణమాఫీ నిధుల విడుదల చేసిన ప్రభుత్వం… దశలవారీగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేస్తూ వస్తుంది.. రూ.25 వేల నుంచి రూ.50 వేల లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ నిధుల విడుదల కొనసాగుతుండగా.. ఇక, రెండో రోజులో భాగంగా 38,050 మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను బదలాయించింది ప్రభుత్వం.. ఇవాళ ఒకేరోజు రుణమాఫీ కింద రూ.100.70 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. కరోనా పరిస్థితులతో ఆర్థిక కష్టాలున్నా..…
తెలంగాణలో గత రెండు రోజులుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. మొన్నటి వరకు మూడు వందల లోపు నమోదైన కేసులు.. నిన్నటి నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 569 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.…