Home
Telangana
Telangana News
-
తెలంగాణలో ‘పీకే’ సత్తా చూపించగలడా?
రాజకీయాలు నిత్యం ఫాలో అయ్యేవారికి ప్రశాంత్ కిషోర్(పీకే) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు దేశంలో మంచి పేరుంది. ఆయన ఏ పార్టీకి వ్యూహాకర్తగా ఉంటే ఆపార్టీనే అధికారంలోకి వస్తుందనే నమ్మకం ప్రజల్లోకి బలంగా వెళ్లిందంటే పీకే సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టుగానే ప్రశాంత్ కిషోర్ సక్సస్ రేటు కూడా భారీగా పెరుగుతూ పోతుంది. ఒకటి అర విషయాల్లో మినహాయిస్తే ఆయన వ్యూహాకర్తగా ఉన్న పార్టీలు అధికారంలోకి రావడమో… -
‘మా’ ఎన్నికలు.. మహేష్ బాబుకు రూ.75 వేలు గూగుల్ పే..!?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. మొత్తంగా వెయ్యి ఓట్లు కూడా లేని మా ఎన్నికలపై అంతా ఫోకస్ పెట్టేలా పరిస్థితి తయారైంది.. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన కొంతమంది తప్పుకున్న తర్వాత.. ఫైనల్‌గా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.. దీంతో.. రెండు ప్యానెళ్లకు చెందినవారి మధ్య యుద్ధమే నడుస్తోంది.. మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ రూ.10 వేలు పంచుతుందంటూ.. మెగా బ్రదర్ నాగబాబు… -
మోత్కుపల్లి నర్సింహులకు పదవీయోగం ఉందా?
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులకు పదవీయోగం ఉందా? ఆ పదవి ఏంటో.. సీఎం కేసీఆర్ ఆయనకు చెప్పేశారా? గులాబీ కండువా కప్పుకోగానే అధికారికంగా ప్రకటన చేసేస్తారా? టీఆర్ఎస్లో ఆయన చేరిక హుజురాబాద్ ఉపఎన్నిక కంటే ముందే ఉంటుందా.. లేదా? సీఎం కేసీఆర్‌తోపాటు అసెంబ్లీకి రావడంతో చర్చల్లోకి మోత్కుపల్లి..! బీజేపీకి దూరమైన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. రేపోమాపో టీఆర్ఎస్ కండువా కప్పేసుకుంటారని చర్చ జరిగినా.. తర్వాత… -
ఈటల రాజేందర్.. రాముడు మంచి బాలుడు లాంటివాడు..!
ఈటల రాజేందర్.. రాముడు మంచి బాలుడు లాంటి వ్యక్తి.. కానీ, ఆయన్ను కూడా మోసం చేశారు రంటూ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఫైర్ అయ్యారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్… కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజేందర్ అన్న రాముడు మంచి బాలుడు లాంటి వాడు.. ఆయన్ను కూడా మోసం చేసింది కేసీఆర్ కుటుంబం అని ఆరోపించారు.. కేసీఆర్ అయన… -
హుజురాబాద్ బైపోల్.. ఈసీకి వైఎస్ షర్మిల లేఖ.. వారిపై చర్యలు తీసుకోండి..!
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌కు లేఖరాశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… హుజురాబాద్ ఉప ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌ను తొలగించాలి, స్థానిక పోలీస్ కమిషన్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర వర్గాల వారు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. నామినేషన్లకు దరఖాస్తులు కూడా ఇవ్వడం లేదని.. అభ్యర్థి మద్దతుదారులను స్థానిక… -
త్వరలోనే తెలంగాణలో గ్రామ దవాఖానలు : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో.. బస్తీ దవాఖానాల తరహాలోనే గ్రామ దవాఖానలు కూడా త్వరలోనే రాబోతున్నాయని..దీని కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 5 లక్షలు ఆదాయం ఉండేట్టు చేశామని.. గ్రామ పంచాయతీ లు ఇప్పుడిప్పుడే లైన్ లో పడుతున్నాయని వెల్లడించారు. 12,769 గ్రామాల్లో 9 వేల కార్యదర్శుల పోస్టులు కొత్తవి వేశామని.. అన్ని పోస్టులకు ప్రమోషన్ కూడా ఇచ్చేశామని తెలిపారు.… -
హెటిరో ఫార్మా పై కొనసాగుతున్న ఐటీ దాడులు
హెటిరో ఫార్మా సంస్థలపై అదాయపు పన్ను శాఖ దాడులు…రెండో రోజు కొనసాగుతున్నాయ్. నిన్న ఉదయం నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కోవిడ్ సమయంలో కంపెనీ లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. సంస్థ డైరెక్టర్లు జొన్నల సంబిరెడ్డి, నరసింహారెడ్డి, బండి వంశీకృష్ణ, బండి పార్థసారథిరెడ్డితో పాటు భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. సనత్‌నగర్‌లోని హెటిరో హెడ్ ఆఫీస్‌తో పాటు వైజాగ్ నక్కపల్లి మండలంలో ఉన్న హెటిరో కార్యాలయంలోనూ…ఐటీ అధికారులు తనిఖీలు… -
తెలంగాణ కరోనా అప్డేట్.. మరింత కిందకు కేసులు..
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,161 శాంపిల్స్ పరీక్షించగా… 187 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 170 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,67,158కు చేరుకోగా… రికవరీ కేసులు 6,58,827కు పెరిగాయి.. ఇక, మృతుల… -
రేపు నల్గొండలో గవర్నర్ తమిళిసై పర్యటన
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.. నల్గొండ పట్టణంలోని సింధూర హాస్పిటల్ లో కిడ్నీ కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు గవర్నర్.. ఆ తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ లో 2వ అంతస్తులో సెమినార్ హాల్‌ను ప్రారభించనున్నారు.. ఇక, అనంతరం పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆమె.. మొక్కలు నాటే కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు.. తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ విగ్రహ… -
టీఆర్ఎస్ సర్కార్‌పై రాములమ్మ ఫైర్.. ప్రభుత్వానికి పట్టదా..?
సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమె… వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని ఎండగట్టారు.. ‘రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా… రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతున్నాయి. రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’…
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!