తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 78,226 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 43,222 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 197.0114 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అయితే గత నెల ఆరంభంలోనే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు నిండుకున్న విషయం తెలిసిందే.