రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో చిన్న జీయర్ భేటీ.. విషయం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో పర్యటనలో ఉన్న శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయును కలిశారు.. 2022 ఫిబ్రవరిలో జరగనున్న సమతా ప్రతిమ (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు.. మొదట ఉపరాష్ట్రపతిని కలిసిన ఆహ్వానం పలకగా.. వివక్షలను నిర్మూలించి సమానత్వ సాధన కోసం భగవద్రామానుజులు కృషి చేశారని.. అతిపెద్ద ప్రతిమ ఏర్పాటు… ప్రపంచానికి రామానుజుని బోధనలు, సందేశం విస్తరించేందుకు తోడ్పడుతుందని ఆకాక్షించారు వెంకయ్య.. సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపు మాపి సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవద్రామానుజుల వారు ఆధ్యాత్మికవేత్తగానే గాక, సామాజిక సంస్కరణాభిలాషిగా సమాజంపై చెరగని ముద్ర వేశారని తెలిపారు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.
ఇక, ఆ తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన చిన్న జీయర్ స్వామీ.. హైదరాబాద్ ముచ్చింతల్ లో 2022 ఫిబ్రవరిలో జరగనున్న 216 అడుగుల సమతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానాన్ని అందజేశారు.. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, ధనుష్ ఇన్ఫోటెక్ సీఎండీ డీఎస్‌ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!