సంగారెడ్డి జిల్లా నీటి పారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ పోస్ట్ మొన్న మే 31న ఖాళీ అయింది. అప్పటిదాకా ఎస్ఈగా పని చేసిన యేసయ్య పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది కుర్చీ. అదేం పెద్ద విషయం కాదుగానీ... అందులో కూర్చునేందుకు ఆఫీసర్స్ అంతా భయపడటమే ఇప్పుడు అసలు సమస్య. పిలిచి ఎస్ఈ పోస్ట్ ఇస్తామన్నా... ఆసక్తి చూపడం లేదట అధికారులు.
నేరాలను అదుపు చేయడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తుంటారు. గొడవలు జరగకుండా, దొంగతనాలు, దోపిడీలకు అడ్డుకట్ట వేస్తూ శాంతి భద్రతలు పరిరక్షిస్తుంటారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. సొసైటీకి పోలీసులు చేస్తున్న కృషి మరువలేనిది. ప్రజా సమస్యలను తీర్చేందుకు.. పోలీస్ సేవలను ప్రజల వద్దకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇదే తరహాలో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సైకిళ్లపై గ్రామ సందర్శన చేశారు వంగర పోలీసులు. Also Read:Rajnath Singh: ‘‘పాలకు…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దగ్గర భజనపరుల సంఖ్య పెరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరిని చూస్తే సొంత పార్టీ నేతలే భయపడుతున్నారని విమర్శించారు. కడియం పని చేయాలంటే కమిట్మెంట్ కావాల్సి వస్తుందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో కడియం అనుచరులు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో 1994-2004 నాటి కడియం నిరంకుశ పాలన మళ్లీ ప్రారంభమైందని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. స్టేషన్ ఘన్పూర్ మీడియా సమావేశంలో…
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల ఆరు నెలల తర్వాత ఉంటుందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఉప ఎన్నికల కోసం కుల సమీకరణ ఆధారంగా అభ్యర్థిని బీజేపీ నిర్ణయించబోతోందని పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ముస్లిం ఓట్ బ్యాంకును బీఆర్ఎస్కి ఎంఐఎంలు విక్రయించారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు ఏ పార్టీకి అమ్ముతారో చూడాలని ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ…
రెండు రోజులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ కూర్పుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. రెండు గంటలకు పైగా చర్చ కొనసాగింది. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పుతో పాటు రాష్ట్రంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల పైనా విస్తృతమైన చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్, హరీశ్ రావు మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు విచారణ అంశంపై చర్చిస్తున్నారు. బలప్రదర్శన ఏర్పాట్లపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్‌కి ఇచ్చేందుకు ఇప్పటికే కేసీఆర్ నివేదిక సిద్ధం చేశారు. అయితే హరీష్ రావును…
కలకాలం తోడు నీడగా ఉండాల్సిన భర్త అనుమానంతో భార్యను కడతేర్చాడు. వివాహేతర సంబంధం ఉందనే కారణంతో భార్యను చున్నీతో ఉరివేసి చంపాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ సరూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. భార్యను చంపిన తర్వాత భర్త పోలీసులకు లొంగిపోయాడు. తన భార్యను తానే చంపినట్లు పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న సరూర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. Also Read: Balakista Reddy: ఆగస్టు 14 లోపు ఇంజినీరింగ్ తరగతులను ప్రారంభిస్తాం.. డబ్బులు వృధా…