బనకచర్లపై కేంద్ర అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు
బనకచర్ల ప్రాజెక్ట్ పై కేంద్ర జలసంఘం అభ్యంతరాలపై దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్ర అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. ఏపీ ఇరిగేషన్ సలహదారు అధికారులతో సమావేశం అయ్యారు.. అయితే, కేంద్ర జలసంఘం.. అడిగిన లెక్కలుపై చర్చ సాగుతోంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్.. నీటి లెక్కలపై అధ్యయనం చేస్తోంది.. ఎల్లుండికి ప్రాథమిక నివేదిక సిద్ధం చేయనున్నారు ఇరిగేషన్ అధికారులు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర జలసంఘంతో సమావేశం కానున్నారు ఏపీ అధికారులు..
ఉధృతంగా తుంగభద్ర.. మంత్రాలయం దగ్గర హెచ్చరికలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది… దీంతో పెద్ద ఎత్తున వచ్చి ఇన్‌ఫ్లో రూపంలో తుంగభద్ర డ్యామ్‌లోకి వచ్చి చేరుతుంది.. అధిక ప్రమాణంలో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం జలాశయానికి 30వేల క్యూసెక్కులకుపైగా నీరు వచ్చి చేరుతుండగా జలాశయం భద్రత దృష్ట్యా 80 టీఎంసీల సామర్థ్యం దాటగానే వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. జలాశయం నుంచి 20 క్రస్ట్‌గేట్లను ఒక్కొక్కటి 2.5 అడుగుల మేర ఎత్తి 58,260 క్యూ సెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయంలో వరద నీరు పెరిగేకొద్దీ మరిన్ని గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు.. ఇక, తుంగభద్ర డ్యామ్ నుంచి నీటి విడుదలతో కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తీర ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రామంజులు, ఎస్ఐ శివాంజల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజధాని విస్తరణకోసం రెండో విడత గ్రామసభ.. ఎమ్మెల్యే, అధికారులకు నిరసన సెగ
ఓవైపు రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల్లో వేగం పెంచిన కూటమి ప్రభుత్వం.. మరోవైపు, రాజధాని విస్తరణపై కూడా దృష్టి సారించింది.. దీనిలో భాగంగా రాజధాని కోసం భూ సమీకరణకు నడుం బిగించింది.. రాజధాని కోసం తీసుకోవాలని భావిస్తోన్న గుంటూరు జిల్లాలోని ఆయా గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు.. అయితే, రాజధాని విస్తరణకోసం రెండో విడత గ్రామసభలో అధికారులకు నిరసన సెగ తాకింది.. తాడికొండ మండలం పొన్నెకల్లులో గ్రామసభ నిర్వహించడానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అధికారుల ఎదుట నిరసనకు దిగారు స్థానికులు.. గ్రామ సభ నిర్వహించడానికి వీల్లేదంటూ పొన్నెకల్లులో రైతులు ఆందోళనకు దిగారు.. ఎమ్మెల్యే, అధికారులు.. గో బ్యాక్.. గో బ్యాక్.. అంటూ నినాదాలు చేశారు.. దీంతో, తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామసభ ఉద్రిక్తంగా మారిపోయింది..
గుడివాడ పీఎస్‌కు మాజీ మంత్రి కొడాలి నాని..
కృష్ణాజిల్లా గుడివాడలో మరోసారి ప్రత్యక్షమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఈ మధ్యే గుడివాడలో కనిపించిన ఆయన.. ఈ రోజు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.. ముందస్తు బెయిల్‌లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేశారు కొడాలి నాని.. అయతే, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నానికి గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. ఆ షరతుల్లో భాగంగానే ఈ రోజు పీఎస్‌కు వచ్చి సంతకాలు చేశారు కొడాలి నాని..
దేవుడి చిత్రపటాల వెనుక గంజాయి పెట్టి.. పూజలు చేస్తున్నట్టు డ్రామా.. పోలీసుల ఎంట్రీతో
ఎక్సైజ్ అధికారులు దులో పేట్ లోని ఆ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.. ఇంటి వాళ్ళందరూ ఎలాంటి ఐరానా పడకుండా ప్రశాంతంగా కూర్చున్నారు.. అందులో ఒకరు పూజ గదిలోకి వెళ్లి బ్రహ్మాండమైన పూజలు చేస్తున్నాడు.. అప్పటికి అధికారులకు అర్థం కాలేదు.. ఇల్లు మొత్తం వెతికినప్పటికీ ఎక్కడ కూడా గంజాయి ఆనావాళ్లు దొరకలేదు.. అరవీర భయంకరంగా పూజలు చేస్తున్న వ్యక్తిని అనుమానంగా చూశారు.. అప్పుడే అనుమానం వచ్చి అధికారులు పూజా గదిలోకి వెళ్లారు.
నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం..
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ (జూలై 2న) తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. తీవ్ర జ్వరంతోనే కేసీఆర్ హాస్పిటల్ లో చేరారని, పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనకు షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగినట్టు ఆసుపత్రి వైద్యుల బృందం పేర్కొన్నారు. అలాగే, సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం రేవంత్ కు బేసిన్ లు తెలియదు.. బెండకాయలు తెలియదు
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. “నీటికి పల్లం ఎలా తెలుసో తెలంగాణ కు నీరు ఎవరు తీసుకు వచ్చారో అందరికి తెలుసు.. తెలంగాణ లో ఏ రైతు ను, ఎద్దును అడిగినా వ్యవసాయం పండుగ ఎవరు చేశారో చెప్తారు.. సీఎం నిన్న రంకెలు వేశాడు.. ఆయన సభ పెట్టాడంటే బూతులతోనే మాట్లాడతాడు.. మా పార్టీ తరుపున మీ సవాలు స్వీకరిస్తున్నాం.. ఎక్కడ చర్చ పెట్టినా వస్తాం.. మీకు కేసీఆర్ అవసరం లేదు.. మేము చాలు.. 72 గంటలు ఇస్తున్నాం.. మీరు ప్రిపేర్ అయి రండి.. సీఎంకు బేసిన్ లు తెలియదు బెండకాయలు తెలియదు.. సమైక్య రాష్ట్రంలో నీళ్లు ఇవ్వలేదు కాబట్టే తెలంగాణ ఉద్యమం పుట్టింది.. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు ఆయన అనునాయులకు వచ్చాయి.. ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం తెలియాలి అంటే బట్టలు విప్పి కొడతాం అన్నారు.. బనకచర్ల ద్వారా మీ గురువు చంద్రబాబు తీసుకెళ్తుంటే మీ తీరు తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది.
పాలస్తీనా వధువుకు నరకం.. 140 రోజులు బంధించి ఏం చేశారంటే..!
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు. దొరికిన వారిని దొరికినట్టే కారాగారంలో వేస్తున్నారు. ఇక పాలస్తీనా పౌరులైతే మరి కఠినమైన చర్యలకు దిగుతోంది. ప్రస్తుతం అమెరికాలో చాలా కఠినమైన నిర్ణయాలు అమలవుతున్నాయి. తాజాగా పాలస్తీనాకు చెందిన ఒక నవ వధువు తనకు ఎదురైన దుస్థితి గురించి విలేకర్ల ముందు గోడువెళ్లబుచ్చుకుంది. తనకెదురైన దుస్థితి ఎవరికీ ఎదురుకాకూడదని వాపోయింది.
టెస్ట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డ్.. ప్రసిద్ధ్‌ను ఆడుకుంటున్న ఫ్యాన్స్!
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న 2వ టెస్ట్‌లో టీమిండియా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు నెలకొల్పాడు. 148 ఏళ్ల టెస్ట్ చరిత్రలో అత్యంత చెత్త ఎకానమీ రేటుతో ప్రసిద్ధ్ రికార్డు సృష్టించాడు. దీంతో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసినట్లే అంటున్నారు ఫ్యాన్స్. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఎడ్జ్ బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో భారీ పరుగులు చేయడంతో ఆధిక్యంలో ఉన్న టీమిండియా, ఇప్పుడు ఓటమి దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే 84 పరుగులకే 5 వికెట్లు తీసిన టీమిండియా పేసర్లు, ఆ తర్వాత వికెట్ల కోసం తీవ్రంగా శ్రమించారు.
విండీస్ ప్లేయర్ వెరీ స్పెషల్.. ఒక్క టీ20 ఆడకుండానే వరల్డ్ రికార్డు
ప్రస్తుతం క్రికెట్లో టీ20ల హవా నడుస్తోంది. ప్రతి దేశం ఒక్కో లీగ్స్ నిర్వహిస్తున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 లీగ్స్ వున్నాయి. అయితే ఇప్పుడున్న క్రికెటర్లు కేవలం టీ20ల కోసం కూడా రిటైర్ అవుతున్నారు. కానీ ఒక ప్లేయర్ వీటన్నిటికీ భిన్నం. ఎందుకంటే ఇప్పటికి ఒక్క టీ20 మ్యాచ్ ఆడలేదు ఈ ఇంటర్నేషనల్ ప్లేయర్ కానీ 100 టెస్టులు ఆడేశాడు. అవును విండీస్ ప్లేయర్ క్రైగ్ బ్రాత్ వైట్ ఏకంగా 100 టెస్టు మ్యాచులు ఆడాడు. కానీ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఇప్పటికి ఆడలేదు. అంతే కాదు వన్డే మ్యాచ్‌లు కూడా కేవలం 10 మాత్రమే ఆడాడు. అది కూడా 8 ఏళ్ల క్రితం చివరి వన్డే ఆడాడు. ఇక టెస్టుల విషయానికి వస్తే.. 2011లో పాకిస్తాన్ మీద తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న 2వ టెస్టులో ఒక మైలురాయిని కూడా అందుకున్నాడు. అదే వెస్టిండీస్ తరుపున 100 టెస్టులు ఆడటం. ఇలా 14 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నా, వన్డే మరియు టీ20ల్లో కనిపించకపోవడం వింతగానే వుంది.
మలయాళ హిట్ సినిమా తెలుగు రీమేక్ ‘ఓం శాంతి శాంతి శాంతిః
మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ హీరోగా నటించిన చిత్రం ‘జయ జయ జయ జయహే’. విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం రూ. 6కోట్లతో నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. థియేటర్స లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఓటిటీలోను విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాను పలుభాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పడు తెలుగు రీమేక్ కు సంబంధించి ప్రకటన చేసారు మేకర్స్.
ఇట్స్ అఫీషియల్.. వార్ 2 తెలుగు రిలీజ్ నాగవంశీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న చిత్రం వార్ 2. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ నిమిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.