వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ఎంజాయ్ చేసిన చిన్నారులు నేడు అంగన్వాడీ కేంద్రాల బాట పట్టారు. మొదటి రోజు కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లు కలిసి చిన్నారులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (డాక్టర్ ధనసరి అనసూయ) ఆదేశాల మేరకు మొదటి రోజు లంచ్‌లో ఎగ్ బిర్యానీని అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు వడ్డించింది. ఎగ్ బిర్యానీని…
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్ జీ తెలుగు. నిరంతరం వినోదం పంచుతూ 83 మిలియన్ల ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు తన కొత్త గుర్తింపు ‘ప్రేమతో.. జీ తెలుగు’తో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్‌లో భాగంగా, జీ తెలుగు ఛానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించే బ్రాండ్ ఫిల్మ్‌ను ప్రసారం చేసింది. ‘మమతతోనే మాట మధురం’ అనే సిద్ధాంతంతో రూపొందిన ఈ ఫిల్మ్, తెలుగు…
KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్రమాలపై తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఈ రోజు (జూన్ 11న) నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్‌కు వెళ్లనున్నారు.
వరుస వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తాజాగా మరో ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈసారి మాత్రం ఆయన గట్టిగా ఇరుక్కున్నారు అని చెప్పకనే కరెక్ట్ అంటున్నారు తుంగతుర్తి ప్రజలు. నియోజకవర్గానికి చెందిన లిక్కర్ సిండికేట్ నిర్వాహకులతో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదం అవుతూ... సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది ఆ వీడియో. ఈ వివాదం ఉమ్మడి నల్గొండ హస్తం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఎవరు సంసారి.... ఎవరు సుద్దపూస.... ఎన్నికల్లో…
ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అనే రీతిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందని బీజేపీ ఎంపీ డా.కే. లక్ష్మణ్ విమర్శించారు. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46వ సారి ఢిల్లీ పర్యటన వెళ్లారు అనుకుంటా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి 18 మాసాల పాలన విశ్లేషిస్తే.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. పేద, వెనుకబడిన వర్గానికి చెందిన నరేంద్ర మోడీ…
తెలంగాణ తాజా రాజకీయం మొత్తం... కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూనే తిరుగుతోంది. కుంగుబాటుపై కమిషన్ విచారణ చివరి దశకు వచ్చిన క్రమంలో... ఇప్పుడు పొలిటికల్ హాట్‌గా మారిపోయింది. ప్రాజెక్ట్ అనుమతులు, నిర్మాణం, సాంకేతిక వివరాలకు సంబంధించి ఇప్పటికే 113 మందిని విచారించి వివరాలు రాబట్టింది కమిషన్. అందులో అన్ని విభాగాలకు చెందిన వారు ఉన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనకు రెండు కళ్లు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి సహాయ సహకారాలతోనే తాను ఇంతటి వాడిని అయ్యాను అని తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దయతో ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు వచ్చిందని, తప్పకుండా ప్రజలకు సేవ చేస్తా అన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి దక్కిన విషయం…